క్రైమ్

ఇదెక్కడి మోసం మావా: వయసు తగ్గిస్తామని రూ.35 కోట్లు కొట్టేసిన కేటు దంపతులు.

వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు కొందరు డబ్బు కోసం టెక్నాలజీ పేరుని వాడుకుంటూ అభం శుభం తెలియని అమాయకులను మోసం చేస్తున్నారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన ఇద్దరు దంపతులు వయసు తగ్గిస్తామని నమ్మిస్తూ దాదాపుగా 35 కోట్ల రూపాయల ఆర్ధిక మోసానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా బయటపడింది.

పూర్తీ వివరాల్లోకి వెళితే కాన్పూర్ కి చెందిన రాజీవ్ దూబే మరియు రష్మీ దంపతులు కిద్వాయ్ నగర్‌లో రివైవల్ వరల్డ్ పేరుతో థెరపీ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ దేశం నుంచి టైం మెషీన్‌ను తెచ్చామని దీంతో 75ఏళ్ళ వయసున్నవారిని 20 ఏళ్ళ వ్యక్తులుగా మార్చేస్తామని ప్రజలని నమ్మించారు. ఈ క్రమంలో తమకి తెలిసినవారిని ట్రీట్మెంట్ కి రిఫర్ చేస్తే భారీ మొత్తంలో డిస్కౌంట్ కూడా ఇస్తున్నట్లు నమ్మబలికారు. ఈ క్రమంలో ట్రీట్మెంట్ లో భాగంగా ఒక్కో సెషన్ కి దాదాపుగా 90వేల నుంచి లక్ష రూపాయలు తీసుకున్నారు.

అయితే డబ్బు చెల్లించిన తర్వాత ఎలాంటి ఫలితాలు కనిపించకపోవడంతో కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రాజీవ్ దూబే మరియు రష్మీ దంపతులపై పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు. దాదాపుగా 40 మందికి పైగా వృద్దులు దాదాపుగా రూ.35 కోట్లు రాజీవ్ దూబే దంపతులకు చెల్లించినట్లు విచారణలో తేలింది. దీంతో పోలీసులు షాక్ అయ్యారు.

Read More : ఐదేళ్ల కొడుకుని చంపి తల్లి సూసైడ్

కొందరు ప్రజలకి తెలియని కొన్ని టెక్నాలజీ పేర్లు చెబుతూ ఇలా ఆర్ధిక మోసాలకు పాల్పడుతున్నారని కాబట్టి జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ప్రజలని హెచ్చరించారు. అలాగే చుట్టూ ప్రక్కలవారిపై అనుమానం ఉన్నట్లైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చెయ్యాలని కోరారు.

Back to top button