అంతర్జాతీయంక్రీడలుక్రైమ్జాతీయం

కాయ్‌ రాజా కాయ్‌ - ఫైనల్‌ మ్యాచ్‌పై రూ.5వేల కోట్ల బెట్టింగ్‌ - దీని వెనుక దావూద్‌ గ్యాంగ్‌ హస్తం

క్రికెట్‌ మ్యాచ్‌…. ఆ క్రేజే వేరు. ఏ టీమ్ గెలుస్తుంది…? స్టార్‌ ప్లేయర్లు ఎంత స్కోర్‌ కొడతారు..? ఏ టీమ్‌ ఎంతవరకు స్కోర్‌ చేస్తుంది…? ఏ బాల్‌కు ఎన్ని పరుగులు వస్తాయి…? ఇలా ప్రతీది ఆసక్తికరమే. ఇక ఫైనల్‌ మ్యాచ్‌ అయితే… అందులోనూ టీమిండియా తలపడుతుంటే… ఇక చెప్పనక్కరలేదు… ఆ మజానే వేరు. ముఖ్యంగా బెట్టింగ్‌ రాయుళ్ల పంట పండినట్టే. బెట్టింగ్‌ల జోరు పెరిగినట్టే. వందలు కాదు వేల కోట్లు చేతులు మారుతుంది.

ఇండియా వర్సెస్‌ న్యూజిలాండ్‌ ఫైనల్‌ మ్యాచ్‌పై కూడా జోరుగా బెట్టింగ్‌ జరిగింది. ఎంతలా అంటే… నోరెళ్ల బెట్టేలా. 5వేల కోట్ల రూపాయలకుపైగా బెట్టింగ్‌ జరిగినట్టు… జరుగుతున్నట్టు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. విచారణలో ఆసక్తికర విషయాలు కూడా వెల్లడించారు. ఈ బెట్టింగ్‌లో ముంబై అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం గ్యాంగ్‌ హస్తం కూడా ఉందట. బెట్టింగ్‌ నిర్వహిస్తున్న బుకీలకు.. దావూద్‌ గ్యాంగ్‌ మధ్య సంబంధాలు ఉన్నాయని ఢిల్లీ పోలీసులు చెప్తున్నారు.

ఈనెల (మార్చి) 4న ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది. ఇందులో భారత్‌-ఆస్ట్రేలియా తలపడ్డాయి. ఆ మ్యాచ్‌కు కూడా భారీగా బెట్టింగ్‌ జరిగింది. అప్పుడు… ఢిల్లీ క్రైమ్‌ పోలీసులు బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ఐదుగురి సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వీరిని ప్రశ్నించగా… విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. లక్కీ డాట్‌ కామ్ అనే వెబ్‌సైట్‌ ద్వారా మాస్టర్‌ ఐడీని క్రియేట్‌ చేసి… దాని ద్వారా బెట్టింగ్‌ ఐడీలు తయారు చేసి పంటరల్‌కు ఇస్తోంది ఆ గ్యాంగ్‌. ఒక్కో లావాదేవీపై మూడు శాతం కమిషన్‌ తీసుకుంటోంది. కొందరు 35వేలు రెంట్‌ కట్టి ఇళ్లు అద్దెకు తీసుకుని మరీ బెట్టింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నారు.

ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. అయితే… ఈ నెట్‌వర్క్‌ అంతా దుబాయ్‌ నుంచి జరుగుతోందని విచారణలో తేలింది. ఛోటా బన్సాల్‌ అనే వ్యక్తి కెనడా నుంచి బెట్టింగ్‌ యాప్‌ క్రియేట్‌ చేసినట్టు చెప్తున్నారు. ఛోటా బన్సాల్‌ దావూద్‌ గ్యాంగ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రస్తుతం అతను దుబాయ్‌లో ఉన్నట్టు గుర్తించారు. ఢిల్లీకి చెందిన వ్యక్తి ఇండియా వర్సెస్‌ న్యూజిలాండ్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతున్న స్టేడియం నుంచి… ఎప్పటికప్పుడు బుకీలకు సమాచారం అందిస్తున్నట్టు పోలీసులు చెప్తున్నారు. క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠాల వెనుక దావూద్‌ గ్యాంగ్‌ హస్తం ఉందని తెలిసి.. ఆశ్చర్యపోతున్నారు పోలీసులు.

ఇది కూడా చదవండి.. 

  1. SLBC టన్నెల్లో మృతదేహాల ఆనవాళ్లు గుర్తింపు – సాయంత్రానికి బయటకి తీసే అవకాశం

  2. నితిన్ సినిమాలో ఆస్ట్రేలియన్ క్రికెట్ ప్లేయర్!.. అసలు తగ్గేదేలే..

  3. ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్ లో తలపడే జట్లు ఇవే!..

  4. తెలుగు రాష్ట్రాలలో అడుగంటుతున్న నీరు… ఎండిపోతున్న పైరు?

  5. టీటీడీ చైర్మన్ ఫోటోను వాట్సప్ డీపీగా పెట్టుకొని భక్తులను మోసం చేస్తున్న మోసగాడు అరెస్ట్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button