- అతి తక్కువ ధరకే భూములను కొల్లగొట్టారు
- పర్యవరణానికి హాని తలపెడుతున్న భారతి సిమెంటు
- దుమ్ము, వ్యర్థాలతో పంటలు దెబ్బతింటున్నాయి
- ఆదు కోవాలని రైతుల, ప్రజల ఆవేదన
కడప, క్రైమ్ మిర్రర్:కడప జిల్లా కమలాపురం ప్రాంతంలో విస్తరించిన భారతి సిమెంట్స్ కర్మాగారంతు చుట్టు ప్రక్కల ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కంపెనీ నిర్మాణంకు భూములు ఇచ్చిన రైతులను విస్మరించి వారి పాలిటనే యముడిలా తయారైంది భారతి సిమెంటు కంపెని.
ఉద్యోగాలు ఇస్తామని తక్కువ ధరకే భూములను కొల్లగొట్టి నేటికి రైతులను పట్టించుకోవడం లో విఫలమైంది. అంతేగాకుండా స్థానికంగా ఉన్న యువతకు ఉద్యోగాలు కల్పించకుండా కంపెనీలో పని చేసే వారిని శ్రమదోపిడి చేస్తుందనే విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి.
అంతేగాకుండా కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు పట్టించుకోకపోవడంతో పర్యవరణం తీవ్రంగా దెబ్బతింటుందని పలువురు ఆవేదన చెందుతున్నారు. కంపెనీ లాభార్జనే ధ్యేయంగా స్థానిక వనరులను కొల్లగొడుతున్నారని బాధితులు ఆవేదన చెందుతున్నారు.
కంపెనీ ఏర్పాటులో 2వేల ఎకరాల భూమి సేకరణ…
భారతి సిమెంట్స్ ఏర్పాటు సమయంలో సుమారు 2,000 ఎకరాలకు పైగా భూమిని రైతుల నుంచి సేకరించినట్లు రికార్డులు చెబుతున్నాయి. అతి తక్కువ ధరకే రైతుల భూములుకొల్లాగొట్టారనే ఆరోపణలు సైతం ఉన్నాయి.
అటు రైతులు భూమిని కోల్పోయి ఇటు కంపెనీలో ఉపాధి దొరక్క అగమ్యగోచర స్థితిలో ఉన్నారు.అభివృద్ధి పేరుతో జరిగిన ఈ భూ దోపిడీపై ప్రస్తుత ప్రభుత్వం దృష్టి సారించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ పెరుగుతోంది.
భారతి సిమెంట్స్ సంస్థకు సుమారు 528 హెక్టార్ల సుమారు 1,300 ఎకరాలు మేర సున్నపురాయి గనుల లీజులు గత ప్రభుత్వంలో అక్రమంగా రాయించుకుని అనుమతులు పొందాయని న్యాయపోరాటం సైతం కొనసాగుతుంది.
కాగా గత ప్రభుత్వంలో అడ్డగోలుగా పొందిన ఈ లీజులను కూటమి ప్రభుత్వం రద్దు చేసేందుకు సిద్దమవుతుంది. అక్రమంగా సాగుతున్న మైనింగ్ల వల్ల ప్రభుత్వ ఖజానకు భారీగానే గండిపడుతుంది.
ఈ కంపెనీలో ఫ్రెంచ్ సంస్థ అయిన వికాట్ 51 శాతం వాటాలను కొనుగోలు చేసి 15 ఏళ్లు గడిచినా వారి ప్రతినిధులు ఎక్కడా కనిపించకపోవడం ఒక పెద్ద మిస్టరీగా మారింది. వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిన విదేశీ సంస్థ నిర్ణయాల్లో ఎందుకు జోక్యం చేసుకోవడం లేదనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఏటా సుమారు వందల కోట్ల రూపాయల లాభాలు గడిస్తున్నప్పటికీ పర్యావరణం కోసం ఒక్క పైసా కూడ ఖర్చు చేయడం లేదని స్థానికులు ఆందోళనకుగురవుతున్నారు. దీంతో కంపెనినుంచి వెలువడే దుమ్మూ దూళితో రైతులకు జీవనాధారమైన పంట పొలాలు దెబ్బతినడంతో ప్రజలకు శ్వాస కోస వ్యాధుల భారిన పడుతున్నారు.
బాధ్యతాయుతమైన కంపెనీగా వ్యవహరించడంలో భారతి సిమెంట్ పూర్తిగా విఫలమైందనేదిబహిరంగ సత్యం, దీంతో కడపలో జగన్ కుటుంబంపై వ్యతిరేకత వ్యక్తమవడం కొసమెరుపు.

