తెలంగాణ

రేవంత్ తాటతీస్తామనగానే.. దిగివచ్చిన ప్రైవేటు కాలేజీల యాజమాన్యం!

క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న అన్ని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వగా.. రెండు గంటల్లోనే ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు దిగివచ్చాయి. విద్యార్థుల జీవితాలతో ఆటలాడితే ఊరుకునే ప్రసక్తే లేదని నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే అన్ని సమస్యలు ఉన్నట్లు మాట్లాడుతున్నారు.. బకాయిల విషయంలో ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తే సహించేది లేదు అని వెల్లడించారు. విద్యను వ్యాపారంగా మారుస్తామంటే ఎవరు ఊరుకోరు అని… విడతల వారీగా నిధులు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అలా కాదు అని.. తమాషాలు చేస్తే తాట తీసి వదిలిపెడతామని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడగా.. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల గుండెల్లో టెన్షన్ మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డి 900 కోట్ల రూపాయలు వెంటనే రిలీజ్ చేస్తామని హామీ ఇవ్వడంతో వెంటనే ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించాయి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కుతో చర్చలు జరపగా అవి సఫలమయ్యాయి. ప్రభుత్వం 900 కోట్ల నిధులు విడుదల చేసేందుకు అంగీకరించింది. దీంతో ఇవాల్టి నుంచి మూతబడిన అన్ని ప్రైవేట్ కాలేజీలు తెరుచుకున్నాయి. గత కొద్ది రోజులుగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కాలేజీలను బంద్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే మిగతా బకాయిల గురించి మళ్లీ ఈ ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఎలా ముందుకు వెళ్తాయి అనేది మరికొద్ది రోజుల్లో మళ్లీ ఉత్కంఠంగా మారే అవకాశాలు ఉన్నాయి.

Read also : గుండ్రంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. తన ప్రాణాలు అడ్డువేసి 8 మంది ప్రయాణికులను కాపాడిన లారీ డ్రైవర్లు!

Read also : రేపు బీహార్ లో మంత్రి లోకేష్ ప్రచారం!.. ఏం మాట్లాడుతారో అని ఉత్కంఠత?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button