క్రైమ్ మిర్రర్ తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్వో) కర్ణన్ తెలిపారు.
యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో డీఆర్సీ సెంటర్‌లో రేపు శుక్రవారం (నవంబర్ 14, 2025) ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్‌లతో ఓట్ల లెక్కింపు మొదలవుతుంది అని తెలిపారు . మొత్తం 407 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓట్లు 58 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేలుస్తాయి. ప్రత్యేక అనుమతితో 42 టేబుల్స్‌ను ఏర్పాటు చేసాం అన్నారు .
కౌంటింగ్ 10 రౌండ్లలో పూర్తి చేస్తారు. లెక్కింపు విధులకు 186 మంది సిబ్బందిని కేటాయించం అన్నారు. ఫలితాలను ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు. మీడియా కోసం ప్రత్యేకంగా ఎల్‌ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేసాము అన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసాము అన్నారు. సెక్షన్ 144 విధించారు అని తెలిపారు…





