తెలంగాణరాజకీయం

Jubilee hills Election: బీఆర్ఎస్ ఓటమిపై కవిత సంచలన ట్వీట్

Jubilee hills Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎదురైన ఓటమి రాజకీయ వర్గాల్లో భారీ చర్చకు దారితీసింది. ఈ పరిస్థితుల్లో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

Jubilee hills Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎదురైన ఓటమి రాజకీయ వర్గాల్లో భారీ చర్చకు దారితీసింది. ఈ పరిస్థితుల్లో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ఎన్నికల ఫలితాలు స్పష్టమైన వెంటనే ఆమె ‘Karma Hits Back’ అంటూ, దండం పెట్టే ఎమోజీలతో చేసిన పోస్టు విస్తృతంగా వైరల్ అవుతోంది. ఈ ట్వీట్‌ను చూసిన ఆమె అనుచరులు, గతంలో కవితపై విమర్శలు చేసిన వారిని ఉద్దేశించి “కవితక్కను తక్కువ చేసి మాట్లాడిన వారందరికీ ఈ ఫలితమే సమాధానం” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇటీవల బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. కేసీఆర్‌ను మినహాయించి మిగతా నేతలపై ఓపెన్‌గా విమర్శలు చేస్తూ వస్తున్నారు. పార్టీ అంతర్గత వ్యవహారాలు, నాయకత్వ నిర్ణయాలపై ఆమె చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పటికే చర్చనీయాంశమయ్యాయి. ఈ తాజా ట్వీట్ కూడా అదే దిశలో మరో బలమైన రాజకీయ సంకేతంగా చూడబడుతోంది. ఆమె వ్యాఖ్యలు, స్పందనలు ఇప్పుడు బీఆర్ఎస్ లోపలే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లోనూ వేడి చర్చలకు దారితీస్తున్నాయి.

ALSO READ: Jubilee hills Election: బీఆర్ఎస్ భారీ ఓటమి.. అసలు కారణాలు ఏమిటి?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button