
Jubilee hills Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాభవం పాలైంది. రెండు నెలల పాటు భారీ ప్రణాళికతో ప్రచారం చేసినా సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయింది. మాగంటి సునీతను అభ్యర్థిగా పెట్టిన బీఆర్ఎస్.. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎదుట పూర్తిగా చేతులెత్తేసింది. 20 వేలకుపైగా మెజార్టీతో కాంగ్రెస్ గెలవడం పార్టీ శ్రేణుల్లో తీవ్ర నిరాశను మిగిల్చింది. ఈ ఓటమికి దారితీసిన కీలక కారణాలు ఆరు ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
ఫెయిలైయిన సెంటిమెంట్
మాగంటి గోపీనాథ్ అకస్మిక మరణం తర్వాత ఆయన భార్యకు సీటు ఇచ్చినా, సానుభూతి అసలు పనిచేయలేదు. ఆంధ్రా సెటిలర్స్, కమ్మ కమ్యూనిటీల మద్దతు రాకపోవడం బీఆర్ఎస్‌కు భారీ మైనస్ అయ్యింది.
మాగంటి కుటుంబంలో విభేదాలు
సునీతకు టికెట్ ఇవ్వడం వజ్రానాథ్, ఆయన తల్లికి నచ్చకపోవడంతో కుటుంబ విభేదాలు బీఆర్ఎస్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి. వజ్రానాథ్‌ను ఒప్పించలేకపోవడం పార్టీ ప్రచారానికి పెద్ద దెబ్బైంది.
కేటీఆర్ ఒంటరి పోరాటం
కేసీఆర్ పూర్తిగా ప్రచారం నుంచి దూరంగా ఉండటం, హరీష్ రావు కుటుంబ కారణాలతో పాల్గొనకపోవడంతో కేటీఆర్ ఒక్కడే పోరాటం చేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ మాత్రం 15 మంది మంత్రులు, ముఖ్యమంత్రి కలిసి భారీ ప్రచారం చేసింది.
మైనార్టీ ఓటు బ్యాంక్ కోల్పోవడం
జూబ్లీహిల్స్‌లో ముస్లీం ఓటర్లు లక్షకు పైగానే ఉంటారు. కానీ అజారుద్దీన్‌కు మంత్రి పదవి రావడంతో ఆయనపై ఉన్న సానుభూతి, కాంగ్రెస్ వైపు మైనార్టీ ఓటు బ్యాంక్‌ను తిప్పింది. బోరబండ, రహమత్‌నగర్ కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరడం బీఆర్ఎస్‌కు మరింత నష్టం చేసింది.
కేసీఆర్ ప్రచారానికి దూరంగా ఉండటం
బీఆర్ఎస్ ప్రధాన ముఖచిత్రం కేసీఆర్. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆయన ప్రజల్లో కనిపించకపోవడం, జూబ్లీహిల్స్ ప్రచారంలో కూడా పాల్గొనకపోవడం, వీడియో సందేశం ఇవ్వకపోవడం కేడర్ ఉత్సాహం పూర్తిగా తగ్గించింది.
బీఆర్ఎస్ ఓవర్ కాన్ఫిడెన్స్
జూబ్లీహిల్స్ తమ గడ్డు అని భావించిన బీఆర్ఎస్ ప్రచార పంథాలో నిర్లక్ష్యం చేసింది. గ్రౌండ్ లెవల్ మేనేజ్‌మెంట్ లోపించడం, కాంగ్రెస్ వ్యతిరేకతను అవకాశంగా మార్చుకోవడం, రేవంత్ రెడ్డి వ్యూహాలు ప్రభావం చూపడం వల్ల చివర్లో మొత్తం పరిస్థితిని కాంగ్రెస్ తమవైపు తిప్పుకుంది.
ALSO READ: Interesting Facts: సాయంత్రం వేళల్లో ఈ పనులు చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందా?





