
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : ఉపఎన్నిక వేళ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగింది ఒక్క సీన్.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త రాజకీయ వేడిని రేపింది. తెల్లవారుజాము నుంచి బీఆర్‌ఎస్ నేతల ఇళ్లలో పోలీసులు ఆచూకీ సోదాలు నిర్వహించడంతో రాజకీయ హీట్ ఒక్కసారిగా పెరిగింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి నివాసాలను పోలీసులు తనిఖీ చేయడంతో గులాబీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమపై కుట్ర పన్ని… పోలింగ్ రోజు ప్రత్యర్థి బూత్‌ల్లోకి రాకుండా చేయాలన్న ఉద్దేశంతో ఈ సోదాలు చేస్తున్నారని బీఆర్‌ఎస్ ఆరోపించింది. గట్టిగా మాట్లాడే నేతలను టార్గెట్ చేయడం.. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడమే అని నేతలు మండిపడ్డారు. ఎలాంటి నోటీసులు లేకుండా సోదాలు నిర్వహించడం.. అప్రమత్తంగా ఉండటం వల్ల పోలీసులే మౌనం గా వెళ్లిపోయినట్టు నేతలు వెల్లడించారు.
Also Read : విద్యార్థులకు ఊరట.. ప్రభుత్వం హామీతో బంద్ విరమించిన ప్రైవేట్ కాలేజీలు
మోతీనగర్‌లో తన నివాసంలో సోదాలు జరుగుతున్న సమయంలో ఆపాలని తమను అడ్డుకోవడంపై మర్రి జనార్ధన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు రౌడీయిజం చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు. సోదాల సమయంలో ఏ ఇంటిలోనూ నగదు పట్టుబడలేదని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సమాచారం తెలుసుకున్న బీఆర్‌ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకోవడంతో కాసేపు ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
ఇక కాంగ్రెస్ వైపు నుంచి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వానిది కక్ష సాధింపుల రాజకీయం కాదు. బీఆర్‌ఎస్ హయాంలో ప్రత్యర్థులను బయటకు రావనివ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం పరిధిలోనే పని చేస్తోంది. తప్పు చేసిన వాళ్లు కచ్చితంగా శిక్షకు తప్పదని అన్నారు. పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఒక్కో క్షణం రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై రాష్ట్ర రాజకీయ దృష్టి సారించింది.





