
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రోజు రోజుకి కూడా ఆగ్రహానికి గురవుతున్నారు. వైసీపీ కార్యకర్తలు, నాయకులపై ఎవరైనా సరే చేయి వేస్తే ఊరుకునేది లేదని.. మీడియా వేదికగా అధికారులను హెచ్చరిస్తున్నారు. కొంతమంది డీఎన్ఏ ఎన్నటికీ మారదు అని పెద్దలు అంటారు. ఇది కరెక్ట్ గా జగన్ కే సూట్ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి అధికారం కోల్పోయి.. నేడు ప్రతిపక్ష హోదాలో ఉన్న కూడా ఆయన మాట తీరు, నడిచే దారి మాత్రం మారలేదు. అధికారంలో లేము కదా అని… మా వైసీపీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడితే ఊరుకునేది లేదని ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్ లు పెట్టి హెచ్చరిస్తూనే ఉన్నారు.
Read also: రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న అలనాటి హీరో.. విజయ్ పార్టీలోకే ఎక్కువ అవకాశాలు?
తాజాగా ఒక మొబైల్ యాప్ తీసుకొస్తాం.. ఏ కార్యకర్తకైనా అన్యాయం జరిగితే.. ఈ యాప్ లో ఆ అధికారికి సంబంధించి లేదా ఆ విషయానికి సంబంధించి పూర్తి వివరాలను అందజేయాలని కార్యకర్తలకు జగన్ సూచించారు. ఎవరైనా అధికారులు వేధిస్తే ఖచ్చితంగా వాళ్ళ పేర్లను నిక్షిప్తంగా ఆ యాప్ లో రాయండి అని.. జగన్ కార్యకర్తలకు డైరెక్ట్ గా చెప్పారు. రేపో, మాపో అధికారంలోకి కచ్చితంగా వస్తాం.. అప్పుడు ఆ అధికారుల పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు హామీ ఇచ్చారు. దీంతో జగన్మోహన్ రెడ్డి ఆగ్రహానికి.. జగన్మోహన్ రెడ్డి డైరెక్టుగా చెబుతున్న మాటలకు కొంతమంది అధికారుల గుండెల్లో భయం నెలకొంది. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీల నాయకుల నుంచి వచ్చిన ఆదేశాలను చాలామంది అధికారులు పాటించాల్సి ఉంటుంది. అధికారంలో ఉన్న నాయకుల మాటలను తప్పకుండా వినాల్సి ఉంటుంది. కాబట్టి వారు ఆదేశించిన ఆదేశాలను అధికారులు తప్పక నిర్వహిస్తూ ఉంటారు. అయితే ప్రతిపక్షంలో ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి.. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టబోమని బెదిరిస్తుంటే అధికారులు ఎలా ధైర్యం చేసి పనులు చేయగలరు అని.. భయపడుతున్నారు. కాబట్టి ప్రభుత్వాలు మారినా, నాయకులు మారిన కూడా అధికారుల భద్రతకు భరోసా కల్పించడానికి ప్రత్యేకమైన చట్టాలు రూపొందించాల్సిన అవసరం ఎంతో ఉందని చాలామంది అధికారులు భావిస్తున్నారు.
Read also : ఒక ప్రధానమంత్రిని లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అంటారా?.. రేవంత్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నారు : కిషన్ రెడ్డి