
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాదయాత్ర చేస్తాను అని చెప్పిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ విషయంపై విజయ్ సాయి రెడ్డి స్పందిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్ని పాదయాత్రలు చేసినా సీఎం కాలేరు అని అన్నారు. కోటరీని నమ్ముకున్నంత కాలం జగన్ ఎన్ని పాదయాత్రలు చేసినా అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు అని తేల్చి చెప్పడం జరిగింది. లిక్కర్ స్కామ్ లో భాగంగా విచారణ జరిగినా అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. జగన్ రాజకీయంగా పక్క ప్రణాళికతో ముందుకు వెళ్తేనే తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అన్నారు. ఒకప్పుడు జగన్ నమ్మినటువంటి బంటుగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఈరోజు ఏకంగా ఆయన పైనే అధికారంలోకి ఎందుకు రాలేడు అనే కారణాలు చెబుతున్నారు. త్వరలో జగన్ పాదయాత్ర చేస్తారు.. వైసిపి పార్టీ నాయకులు మరియు కార్యకర్తల్లో జోష్ ఊపు అందుకున్న సమయంలో విజయ్ సాయి రెడ్డి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు మరోసారి నిరాశకు గురి చేసేలా ఉన్నాయి.
Read also : గుంతల మయమైన రోడ్డును మొరంతో చదును చేయించిన సర్పంచ్ తండ మంజుల నరసింహ గౌడ్
Read also : వసంత పంచమి రోజున అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అక్షరాభ్యాసం





