బీజేపీ ఎంపీల లగచర్ల పర్యటన తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి లగచెర్ల వెళుతుండగా మొయినాబాద్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. అదుపులోనికి తీసుకుని నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్రమ అరెస్టులఫై ఎంపి డీకే అరుణ సీరియస్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి పోయేకాలం దగ్గర పడిందని అరుణ హాట్ కామెంట్స్ చేశారు. అందుకే నియంతలా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు.తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందని.. ఒక ఫ్యామిలీ పాలన పోయిందనుకుంటే ఇంకోటి వచ్చిందన్నారు. అన్నదమ్ముల పాలిటిల్స్ నై చల్తా.. అధికారం చేతిలో ఉంది ఏదైనా చేసేస్తా అంటే ఊరుకోబోమని హెచ్చరించారు. ఒక నియంతలా వ్యవహరిస్తున్న రేవంత్ కు ఆ కుర్చీలో కూర్చునే అర్హత లేదని డీకే అరుణ మండిపడ్డారు. కొడంగల్ ఏమైనా నీజాగీరా?.. పోలీసులని అడ్డం పెట్టుకుని పాలన చేస్తున్న రేవంత్ కుర్చీ దిగిపో అంటూ రెచ్చిపోయారు.
ఒక ఎంపీగా నా నియోజకవర్గానికి నేను పోవద్దా?.. నన్ను అడ్డుకునేహక్కు నీకెక్కడుందని అరుణమ్మ ప్రశ్నించారు. నేను లగచర్లకు పోతే నీకు ఎందుకు అంత భయం.. అప్పుడు అలా ఇప్పుడు ఇలా.. ఒకప్పుడు ఫార్మా సిటీ వద్దన్న రేవంత్, ఇప్పుడెందుకు ఫార్మా కావాలంటున్నావ్ అని అరుణ నిలదీశారు. పచ్చటి పొలాల్లో ఎందుకు విషం చిమ్ముతున్నావ్.. ఏం లాభం కోసం మీరు అమాయక రైతులు, గిరిజనులను అడ్డుకుంటున్నావ్..నేను ఎంపీగా నా నియోజకవర్గం ప్రజలను కలవొద్దా?.. అక్కడున్నవారు మీకు ఎందుకు భూములు ఇవ్వాలి?.. నిన్ను నమ్మి గెలిపిస్తే బెదిరించి భూములు లాక్కుంటారా?.. ఇప్పటికైనా నీ ఫార్మా పంతం మానుకో.. ఎందుకు డీకే అరుణను అడ్డుకుంటున్నావో సమాధానం చెప్పాలని అన్నారు.గతంలో ఇలానే అరాచక పాలన చేసి కేసీఆర్ విర్ర వీగాడుపోయాడు.. మిస్టర్ రేవంత్ నీకు పోయే కాలం దగ్గర పడింది..అందుకే నన్ను అడ్డుకుంటున్నావ్ అంటూ డీకే అరుణ విరుచుకుపడ్డారు.
మరిన్ని వార్తలు చదవండి ..
మహారాష్ట్రలో దుమ్ము రేపుతున్న కోమటిరెడ్డి.. ఢిల్లీ పెద్దలు ఖుషీ
పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టు షాక్.. సంగారెడ్డి జైలుకు కేటీఆర్
తెరుచుకున్న శబరిమల ఆలయం.. ఆన్ లైన్ లో దర్శనాల బుకింగ్స్
చెత్తకుప్పల్లో కులగణన సర్వే పత్రాలు.. ఆందోళనలో జనాలు
ప్రధాని మోడీకి తప్పిన గండం.. బీజేపీలో కలవరం
నయీం ఇంటికి వెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
మహిళలకు అర్దరాత్రి పోలీసుల వేధింపులు..రేవంత్‌కు పుట్టగతులుండవ్!
కేటీఆర్.. నీ బొక్కలు ఇరుగుతయ్.. పీసీసీ చీఫ్ వార్నింగ్
కేటీఆర్ ఇంటి దగ్గర అర్ధరాత్రి టెన్షన్
ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఒరిజినల్ కాంగ్రెస్ నేత అర్ధనగ్న ప్రదర్శన
తిరుమలలో భారీ వర్షం.. భక్తులకు తీవ్ర ఇబ్బందులు
ఢిల్లీలో కాళ్లు మొక్కుతున్న కేటీఆర్! పొంగులేటి దగ్గర పక్కా ఆధారాలు.
కొడంగల్ అధికారిపై దాడి.. 300 మంది రైతులు అరెస్ట్
సమగ్ర సర్వే సిబ్బంది పైకి కుక్కలు..వణికిపోతున్న టీచర్లు
ఔలా గాళ్ల సంఘం అధ్యక్షుడిగా కేటీఆర్!
రైతులకు గండం.. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు
రేవంత్ కంటే కేసీఆర్ చాలా నయం.. బండి సంజయ్ సంచలన కామెంట్స్
త్వరలో జనంలోకి కేసీఆర్.. ఆ సెంటర్ నుంచే రేవంత్ పై శంఖారావం!
ముగ్గురు విదేశాల్లో.. ముగ్గురు మహారాష్ట్రలో.. తెలంగాణలో దిక్కులేని మంత్రులు!
రేవంత్ యాత్రకు రాజగోపాల్ రెడ్డి డుమ్మా.. వెంకట్ రెడ్డే కారణమా?