Homeతెలంగాణమంత్రి పదవి ఇస్తే ఓకే.. లేదంటే సీఎం అవ్వడానికి సిద్ధం : రాజగోపాల్ రెడ్డి

మంత్రి పదవి ఇస్తే ఓకే.. లేదంటే సీఎం అవ్వడానికి సిద్ధం : రాజగోపాల్ రెడ్డి

క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయాలు ప్రతిరోజు ఎందుకు ఇంత సెన్సేషన్ సృష్టిస్తున్నాయి అంటే దానికి గల కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. ఒకవైపు అధికార మరియు ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటలు యుద్ధాలు కొనసాగుతుంటే మరోవైపు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిపై కూడా కీలక చర్చలు జరుగుతున్నాయి. ఇక తాజాగా చౌటుప్పల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందిన సందర్భంగా విజయోత్సవ ర్యాలీలో భాగంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ ర్యాలీలో భాగంగానే ఆయన మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపోయేలా చేశాయి.

పెళ్లిపై మృణాల్ షాకింగ్స్ కామెంట్స్

రాబోయే రోజుల్లో నాకు కచ్చితంగా మంత్రి పదవి వస్తుంది. ఇచ్చిన మాట ప్రకారం అధికార ప్రభుత్వం నాకు పదవి ఇవ్వాలి. లేదంటే ఈ తెలంగాణ ప్రజల కోసం ఏకంగా ముఖ్యమంత్రిని కూడా అవుతాను అని అన్నారు. మీరు మునుగోడు ప్రాంతాన్ని చూసుకోండి నేను తెలంగాణ రాష్ట్రాన్ని చూసుకుంటాను అని ఈ ర్యాలీలో భాగంగా వ్యాఖ్యానించడంతో అక్కడున్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా వెంటనే “సీఎం.. సీఎం” అంటూ నినాదాలు చేశారు. దీంతో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్నాయి. త్వరలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మరి మంత్రి పదవి ఇస్తారా లేదా అనేది కూడా ఇంకా స్పష్టత లేదు. కానీ మంత్రి పదవి ఇస్తామని మాటయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. మరి ఈ విషయంపై కాంగ్రెస్ పెద్దలు ఏ విధంగా స్పందిస్తారు అనేది కూడా కాస్త ఆసక్తికరంగా మారింది.

UPSC Jobs: 80 పోస్టులతో IFS నోటిఫికేషన్.. త్వరగా అప్లై చేసుకోండి..

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

Most Popular

Recent Comments