Homeతెలంగాణఅభివృద్ధి చేసే బాధ్యత నాది.. ఆశీర్వదించే బాధ్యత మీది : ఎమ్మెల్యే వేముల వీరేశం

అభివృద్ధి చేసే బాధ్యత నాది.. ఆశీర్వదించే బాధ్యత మీది : ఎమ్మెల్యే వేముల వీరేశం

చిట్యాల,క్రైమ్ మిర్రర్:- చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో 09వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఎర్పుల పరమేష్ , 10వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి సిలువేరు శేఖర్ చెయ్యి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రజలను కోరారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వార్డుల్లో ఉన్న ప్రతి సమస్యను గుర్తించి, అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున అభివృద్ధి పనులకు ఎలాంటి అడ్డంకులు ఉండవని, ప్రజల సహకారంతో చిట్యాల మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఫోరం అధ్యక్షులు కాటం వెంకటేశం, గుడిపాటి లక్ష్మీ నరసింహ, మారగోని ఆంజనేయులు, పాటి మాధవరెడ్డి, బెల్లీ సత్తయ్య, పాటి నర్సిరెడ్డి, ఎస్కే ఇబ్రహీం, జగిని బిక్షం రెడ్డి, కొసనం అశోక్ ,ఓర్సు సైదులు, మధుసూదన్, దివాకర్ రెడ్డి , మహేందర్ రెడ్డి,సల్ల రాజు, ఖమ్మం పాటి సతీష్ ,కళ్లెం నరసింహ,జడల సుమన్ తదితరులు పాల్గొన్నారు.

1988-89 సంవత్సరం పదవ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Rafael Jets Deal: మరో 114 రఫేల్ జెట్స్ కొనుగోలు.. త్వరలో భారత్ గ్రీన్ సిగ్నల్!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

Most Popular

Recent Comments