
క్రైమ్ మిర్రర్,అంతర్జాతీయ న్యూస్ :- అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా రష్యా ప్రధాన ఆయిల్ కంపెనీలు అయినటువంటి రాస్నేస్ట్, లూకోయల్ పై ఆంక్షలు విధించారు. దీంతో రష్యా సంస్థలపై యుఎస్ ప్రజలు, సంస్థలు ఎలాంటి వానిజ్యం చేయకుండా నిషేధం అమలులో ఉంటుంది అని పేర్కొన్నారు ట్రంప్. ఈ చర్యలన్నీ కూడా రష్యా శక్తి వనరులపై ఒత్తిడిని పెంచడమే కాకుండా ఆ దేశ ఆర్ధిక వ్యవస్థ ను కూడా బలహీనం చేస్తాయని ట్రంప్ అన్నారు. ఇరుదేశాల మధ్య శాంతికి తామే మొగ్గుచూపుతామని… ఉక్రెయిన్ తో కాల్పుల విరమణకు అంగీకరించాలని రష్యాను ట్రంప్ కోరారు.
Read also : ఆవేశంలో మాట్లాడిన మాటలు అవి.. సీఎం కు క్షమాపణలు చెప్పిన సురేఖ
అయితే తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్, ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలపై స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమెరికా మాపై ఆంక్షలు విధించడాన్ని పుతిన్ తప్పుబట్టారు. ట్రంప్ చేస్తున్నటువంటి విదానాలు మా పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నమే అని అన్నారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు వల్ల మా దేశం ఆర్థిక వ్యవస్థ అనేది కొంచెం కూడా ప్రభావితం అవ్వదు అని తేల్చి చెప్పారు. ఆత్మగౌరవం ఉన్న ఏ దేశం కూడా ఒత్తిడిలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోదు అని కౌంటర్ ఇచ్చారు. మరోవైపు 3000 కిలోమీటర్ల రేంజ్ ఉన్న క్షిపనులు అలాగే యూఎస్ లాంగ్ రేంజ్ తోమహాక్ మిసైల్స్ వంటి వాటితో రష్యాపై.. ఉక్రెయిన్ గనుక దాడికి దిగితే కచ్చితంగా ప్రతిస్పందన చాలా తీవ్రంగా ఉంటుందనీ..అది మైండ్ లో ఉంచుకొని జాగ్రత్తగా నడుచుకోవాలని పుతిన్ తీవ్రంగా హెచ్చరించారు. దీంతో మెల్లిమెల్లిగా మళ్లీ యుద్ద వాతావరణ పరిస్థితులు మొదలవుతున్నాయని చెప్పాలి. నేపథ్యంలోనే ఇరుదేశాల మధ్య సంబంధాలు తెగిపోయే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Read also : భారీ వర్షాలపై దుబాయ్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం!





