
క్రైమ్ మిర్రర్, ఢిల్లీ న్యూస్:- ఈ మధ్య ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్రంగా క్షీణించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఢిల్లీలోని గాలి కాలుష్యం పై తాజా పరిస్థితిలను దృష్టిలో ఉంచుకొని సుప్రీంకోర్టు సైతం నేడు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఢిల్లీలో గాలి కాలుష్యం పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది అంటూ.. ప్రజల ఆరోగ్యాన్ని ఈ కాలుష్యం నుంచి కాపాడేందుకు కేవలం మాస్కులు మాత్రమే సరిపోవు అని కీలక ప్రకటన చేసింది. ఢిల్లీలోని లాయర్లందరూ కూడా వర్చువల్ గా విచారణకు హాజరు అవ్వాల్సిందే అని సూచించింది. ఢిల్లీలోని ప్రస్తుత గాలి కాలుష్యం పరిస్థితుల పట్ల ఒకవైపు నగరానికి మరోవైపు ప్రజలందరికీ కూడా శాశ్వత నష్టం జరుగుతుంది అని వెల్లడించింది. మరోవైపు పంజాబ్ మరియు హర్యానా రాష్ట్రాలలో పంట వ్యర్ధాలను తగలబెడుతున్న కారణంగా ఢిల్లీలో గాలి కాలుష్యం క్షీణించింది అని ప్రతి ఒక్కరు కూడా ఆరోపిస్తున్న సందర్భంలో.. పంజాబ్ మరియు హర్యానా ప్రభుత్వాలు పంట వ్యర్థాలను తగలబెట్టడానికి అరికట్టేందుకు తీసుకున్న చర్యలపై ఒక స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. ఢిల్లీలో కాలుష్యం పై ఎలాంటి చర్యలు తీసుకోకపోతే మరి కొద్ది రోజులలో ప్రజలు పూర్తిగా అనారోగ్య బారిన పడతారు అని హెచ్చరించింది. ఈ మధ్య దీపావళి సందర్భంలో కూడా ఢిల్లీ నగరవ్యాప్తంగా టపాసులు కాల్చడంతో మరింత కాలుష్యం పెరిగింది అని ఆయా ప్రతిపక్ష పార్టీల రాజకీయ నాయకులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ ఢిల్లీలో గాలి కాలుష్యం పై అధికారులు కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప ఈ పరిస్థితులు మారవు అని ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read also : Bihar Elections: కౌంటింగ్ వేళ అధికారులకు ఆర్జేడీ నేత వార్నింగ్
Read also : Office Romance: భారత్‌లో పెరుగుతున్న ఆఫీస్ ప్రేమాయణాలు.. ఎన్నో స్థానం అంటే..?





