Homeఆంధ్ర ప్రదేశ్ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరమైన మార్పు..?

ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరమైన మార్పు..?

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజాబలం లేకపోయినప్పటికీ షర్మిల నిరంతరం జనం మధ్యలో తిరుగుతూ ఉన్నారు. కానీ మరోవైపు 40 శాతం ఓటు బ్యాంకు ఉందంటూ గొప్పగా చెప్పుకుంటున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్యాలెస్కే పరిమితమవుతున్నారు. గత కొద్ది రోజుల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2029 ఎలక్షన్స్ కు ముందు పాదయాత్ర చేస్తానని మీడియా వేదికగా తెలిపారు. అయితే పాదయాత్ర చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయగా వైసీపీ పట్టి పట్టినట్లు సైలెంట్ గా ఉన్నారు.

ఒకవైపు జగన్మోహన్ రెడ్డి చెల్లిగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్రం నలుమూలల తిరుగుతూ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి తప్పులను బయటపెడుతూ ముందుకు సాగుతున్నారు. కానీ మరోవైపు జగన్మోహన్ రెడ్డి కనీసం అసెంబ్లీకి కూడా రావడానికి వెనకడుగు వేస్తున్నారు. ఒకవైపు ప్రజా సమస్యలపై వైఎస్ షర్మిల గొంతు ఎత్తుతుంటే మరోవైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎలక్షన్స్కు ముందు మాత్రమే జనంలోకి వస్తాను అంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఈ విషయంపై ప్రజల్లో కూడా కాస్త చర్చలు జరుగుతున్నప్పటికీ షర్మిల ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేదన్నట్టుగానే రాష్ట్రంలో పరిస్థితి ఏర్పడింది అనుకుంటున్నారు. జగన్ కార్యకర్తలు మాత్రం జగన్ జనం మధ్యలోకి రాకపోయినప్పటికీ మా గుండెల్లో ఉంటారు అంటూ మీడియాల వేదికగా తెలియజేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే సొంత చెల్లి షర్మిల రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటూ సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది ప్రశ్నలు సంధిస్తున్నారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

Most Popular

Recent Comments