- నిజం తెలియడంతో షాక్ గురైంది
- సోషల్ మీడియా పరిచయం ఏమి నేర్పింది
తిరుపతి, క్రైమ్ మిర్రర్: సోషల్ మీడియా వ్యామోహాలు ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయో నిత్యం చూస్తున్నాం. కొందరు అనైతిక సంబంధాలకు, అసంఘీక కార్యకలాపాలకు సోషల్ మీడియాను మాధ్యమంగా వాడుకొని కొందరు ఎందరో జీవితాలను చిన్నాభిన్నం చేసిన సంఘటనలు చూస్తున్నాం.
తాజాగా ఇలాంటి సంఘటనే సోషల్ మీడియా పరిచయం ఓ వివాహతను తప్పు దారి పట్టేలా చేసింది. పెళ్లైన, ముగ్గురు పిల్లలున్న ఝార్కండ్‌కు చెందిన 30 ఏళ్ల వివాహితకు సోషల్ మీడియాలో ఏపికి చెందిన వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది.
రోజు ఇద్దరు గంటల కొద్ది చాటింగ్ చేసుకునేవారు ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితికి వచ్చారు. ఆడియో కాల్స్, వీడియో కాల్స్ చేసుకున్నారు.ఈ క్రమంలో తను ఒక ధనవంతుడిగా, వ్యపారవేత్తగా పరిచయం చేసుకున్నాడు.పూర్తిగా నమ్మి భర్త, ముగ్గురు పిల్లలను వదిలి ఇన్‌స్టా గ్రాం ప్రియుడితో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఏపీలోని కృష్ణాజిల్లా మచిలీపట్నంలో తన ఆన్‌లైన్ ప్రియుడిని కలుసుకుంది.
అక్కడే అసలు నిజం బయట పడింది. తనను ధనవంతుడు అని చెప్పుకున్న వ్యక్తి రోజు దినసరి కూలీ అని తెలియడంతో షాక్ కు గురైంది.ఎంతో నిరాశకులోను అయింది. ఇంతలో ఆమె కుటుంబ సభ్యులు ఆచూకి కోసం ప్రయత్నాలు మొదలు పెట్టగా ఫోన్ సిగ్నల్, సోషల్ మీడియా వివరాల ఆధారంగా ఆమె ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు.
పోలీసులు జోక్యంతో మహిళను సురక్షితంగా బంధువులవద్దకు తీసుక రాగా వారు ఆమెకునచ్చ చెప్పడంతో చివరకు తిరిగి కుటుంబం వద్దకు చేరింది. ఈ ఘటనలో విశేషం ఏమిటంటే భార్య దారి తప్పిన భర్త మంచి మనస్సుతో ఆమెను ఏలుకునేందుకు కుటుంబం కోసం పిల్లల భవిష్యత్‌కోసం మరో అవకాశాన్నిఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. కాగా టెక్నాలజీ దూరాలను దగ్గర చేస్తుంది, మరోవైపు చెడు పరిచయాలను కూడచేస్తుంది. అందుకే సైబర్ నిపుణలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూనే ఉన్నారు.
