Wednesday, March 25, 2026
Homeతెలంగాణక్యాతనపల్లిలో స్ట్రాంగ్ రూమ్,కౌంటింగ్ కేంద్రాల తనిఖీ

క్యాతనపల్లిలో స్ట్రాంగ్ రూమ్,కౌంటింగ్ కేంద్రాల తనిఖీ

రామకృష్ణాపూర్,క్రైమ్ మిర్రర్:- జిల్లా పరిధిలోని నాలుగు మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్‌కు త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో పోలీస్ శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడుతోందని, మంచిర్యాల డీజీపీ ఏ భాస్కర్ తెలిపారు. ప్రజలు ఎటువంటి భయం లేకుండా, స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.శనివారం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సీఈఆర్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్, కౌంటింగ్ హాల్‌లను బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, మందమర్రి సీఐ రమేష్, రామకృష్ణపూర్ ఎస్ఐ శ్రీధర్‌లతో కలిసి ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రతా పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు.ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పోలింగ్ స్టేషన్లను సున్నిత, అతి సున్నిత ప్రాంతాలుగా వర్గీకరించి దానికి అనుగుణంగానే బందోబస్తు ప్రణాళికను రూపొందించినట్లు వెల్లడించారు.ప్రజలందరూ బాధ్యతగా 100 శాతం ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ పూర్తి రక్షణ కల్పిస్తుందని, ఎన్నికల నియమ నిబంధనలు పాటిస్తూ శాంతియుత వాతావరణంలో ఎన్నికలు పూర్తయ్యేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి కూడా నిబంధనల పట్ల స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం నిఘా కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.

READ ALSO

వారంలో ఒక్కరోజు ఫోన్‌కు దూరంగా ఉంటే ఏమవుతుందో తెలుసా?

పాఠశాలలో ఉపాధ్యాయుడి కామచేష్టలు.. దేహశుద్ధి చేసిన గ్రామస్తులు

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments