అంతర్జాతీయం

బేడీలు వేసి, నేల మీద పడేసి.. భారతీయ విద్యార్థిపై అమెరికా అధికారుల అమానుషం!

Handcuffed- Crying:  అక్రమ వలసదారులపై అమెరికా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. లాస్ ఏంజెల్స్ లో ఆందోళనకారులు అమెరికాలో ఆందోళనలు కొనసాగిస్తున్న నేపథ్యంలో దేశంలోకి అడుగు పెట్టే వారిపట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ భారతీయ విద్యార్థి పట్ల అమెరికా అధికారులు వ్యవహరించిన తీరుపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. న్యూజెర్సీలోని నేవార్క్ విమనాశ్రయంలో జరిగిన ఈ దారుణంపై భారతీయ ఎన్నారైలు  మండిపడుతున్నారు.

సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసిన కునాల్‌ జైన్‌

భారతీయ విద్యార్థి పట్ల అమెరికా అధికారుల వ్యవహారానికి సంబంధించిన వీడియోను కునాల్ జైన్ అనే ఎన్నారై సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఘటన తన మనసును ఎంతో కలవరపాటుకు గురి చేసిందన్నారు. యువ విద్యార్థిని నేరస్థుడిలా ట్రీట్ చేయడం గుండెను పగిలేలా చేసిందన్నారు. “విమానాశ్రయంలో ఓ ఇండియన్ స్టూడెంట్ కు హ్యాండ్ కప్స్ తగిలించి తిప్పి పంపడం చూశాను. ఎన్నో కలలతో ఆయన అమెరికాకు వచ్చాడు. ఎవరినీ ఇబ్బంది పెట్టాలని రాలేదు. ఆ అబ్బాయి ఏడుస్తుంటే నాకూ ఏడుపు వచ్చింది. ఇది నిజంగా దారుణం” అని జైన్ రాసుకొచ్చాడు.

సరైన సమాధానం చెప్పలేక అవస్థలు

పోలీసులు దారుణంగా వ్యవహరించిన యువకుడు హర్యానాకు చెందినవాడు అనిపించిందని జైన్ వెల్లడించాడు. ఈ తరహా ఘటనలు ఇటీవలి తరచుగా జరుగుతున్నాయన్నారు. “చాలా మంది విద్యార్థులు వీసా వచ్చిన వెంటనే అమెరికాకు వస్తున్నారు. వారు ఎందుకు అమెరికాకు వచ్చారో అధికారులకు సరిగా చెప్పలేకపోతున్నారు. పైగా వారిని నేరస్థుల మాదిరిగా చూస్తున్నారు. అదే రోజు సాయంత్రం విమానంలో తిరిగి పంపుతున్నారు. జైన్‌ షేర్‌ చేసిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “నేను పిచ్చివాడిని కాదు, నన్ను అధికారులు పిచ్చివాడిలా మార్చాలని చూస్తున్నారు” అని ఆ యువకుడు అరవడం ఆ వీడియోలో ఉంది. ఈ ఘటనపై ఎన్నారైలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: అమెరికాలో ఆందోళనల కల్లోలం, లాస్ ఏంజిల్స్‎లో నిరసన జ్వాలలు!

Back to top button