
Indian Army: రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు కొనసాగిస్తే భారత్ మీద ప్రస్తుతం విధిస్తున్న 25 శాతం సుంకాలను మరింత పెంచుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు దిగిన నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ గట్టి కౌంటర్ ఇచ్చింది. అమెరికా ద్వంద నీతిని ఎండగట్టే ప్రయత్నం చేసింది. 1971 యుద్ధంలో పాకిస్తాన్ కు అమెరికా ఎలా అండగా నిలిచిందో వివరించింది. 1954 నుంచి దాయాది దేశానికి 2 బిలియన్ డాలర్లు విలువ చేసే ఆయుధానాలను పంపిందని వెల్లడించింది. దీనికి సంబంధించి 1971లో వచ్చిన వార్తా కథనాన్ని ఇండియన్ ఈస్ట్రన్ కమాండ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. బంగ్లాదేశ్ లో పాక్ దురాక్రమణను నాటో దేశాలు పట్టించుకోలేదని కూడా ఆ కథనం ఆరోపించింది.
పాకిస్తానిక్ ను అమెరికా ఎలా వెన్నదట్టి పోత్సహిస్తుందో నాటి రక్షణ మంత్రి వీసీ శుక్లా పార్లమెంటులో ప్రస్తావించిన విషయాన్ని ఇందులో ప్రస్తావించింది. పాకిస్థాన్‌కు ఆయుధాలు అమ్మేందుకు ఫ్రాన్స్, సోవియట్ యూనియన్ నిరాకరిస్తే, ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో కూడా పాకిస్థాన్ కు అమెరికా ఆయుధాను అందించిందని శుక్లా పార్లమెంటులో వెల్లడించారు. 1971 ఘర్షణల్లో బంగ్లాదేశ్ లో పాకిస్థాన్ చర్యలను నాటో దేశాలు పట్టించుకోలేదనిశుక్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా, చైనా దేశాలు తమ ఆయుధాలను పాక్‌కు అమ్ముకున్నారని, ఆ దేశాలు సమకూర్చిన ఆయుధాలతోనే పాకిస్థాన్ యుద్ధం చేసిందని వెల్లడించారు. ఆ తర్వాత కొద్ది నెలలకు బంగ్లాదేశ్ స్వాతంత్ర్యానికి మద్దతుగా భారత్ నిలిచింది.
మా దేశ ప్రయోజనాలే ముఖ్యం!
మరోవైపు ట్రంప్ తాజా హెచ్చరికలపై భారత్ సూటిగా స్పందించింది. అమెరికా ద్వంద్వ ప్రమాణాలను ఎత్తి చూపింది. ఉక్రెయిన్ యుద్ధానికి ముందు చమురు ధరలు పెరిగినప్పుడు రష్యా నుంచి దిగుమతులను ఆమెరికా ప్రోత్సహించిన విషయాన్ని మర్చిపోకూడదన్నారు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగానే భారత కొనుగోళ్లు ఉంటాయని తెలిపింది. అన్ని ప్రధాన ఆర్థిక వ్యవస్థల తరహాలోనే జాతీయ ప్రయోజనాలు, ఆర్థిక భద్రత మేరకు భారత్ ప్రయత్నాలు చేస్తుందని తేల్చి చెప్పింది.
Read Also: ట్రంప్ టారిఫ్ బెదిరింపులు.. తీవ్రంగా స్పందించిన భారత్!