Tuesday, February 24, 2026
Homeజాతీయంభారత అమ్ములపొదిలోకి మరో అణ్వస్త్రం, అగ్ని 5 పరీక్ష విజయం

భారత అమ్ములపొదిలోకి మరో అణ్వస్త్రం, అగ్ని 5 పరీక్ష విజయం

Agni 5 Missile: దేశ వ్యూహాత్మక రక్షణ సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా భారత్‌ మరో కీలక ముందడుగు వేసింది. ఇంటర్‌ మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ ‘అగ్ని 5‘ పరీక్ష విజయవంతం అయింది. ఒడిశాలోని  చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి అగ్ని 5 పరీక్ష జరిగింది. ఆపరేషనల్, టెక్నికల్ పారామీటర్స్‌ ను దృష్టిలో పెట్టుకుని ఈ పరీక్ష జరిగింది. స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్ ఈ పరీక్ష నిర్వహించింది. ఈ మేరకు భారత రక్షణ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. “స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో ఈ పరీక్ష జరిగింది. భారత అమ్ములపొదిలోకి మరో అణ్వాయుధం వచ్చి చేరింది” వెల్లడించింది.

అగ్ని 5 ప్రత్యేకతలు

అగ్ని 5ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) అభివృద్ధి చేసింది. అగ్ని సిరీస్‌ లో అగ్ని 5 అత్యంత అత్యాధునికమైన మిస్సైల్. ఇది ఉపరితలం మీద నుంచి ఉపరితలానికి ప్రయోగించే మిస్సైల్. 5 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఇది ఛేదించగలదు. అగ్ని 5 రేంజ్‌ ను మరింత పెంచడానికి డీఆర్‌డీఓ ప్రయత్నిస్తోంది. 7,500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించేలా మార్పులు చేయాలని చూస్తోంది. అగ్ని 5 ఒకే సారి మూడు బాంబులను పేల్చగలదు. మరోవైపు డీఆర్‌డీఓ అగ్ని 5లో కొత్త వేరియంట్లను అభివృద్ధి చేస్తోంది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments