Homeక్రీడలుAUS-W vs IND-W T20: ఆస్ట్రేలియాతో ఫస్ట్ టీ20.. దుమ్మురేపిన భారత అమ్మాయిలు!

AUS-W vs IND-W T20: ఆస్ట్రేలియాతో ఫస్ట్ టీ20.. దుమ్మురేపిన భారత అమ్మాయిలు!

  • ఆస్ట్రేలియాలో భారత మహిళా జట్టు పర్యటన
  • సిడ్నీ వేదికగా ఆసీస్‌ తో తొలి టీ20
  • డక్‌ వర్త్ లూయిస్ పద్ధతిలో టీమిండియా విక్టరీ   

భారత మహిళా జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా సిడ్నీ వేదికగా ఆసీస్‌తో జరిగిన తొలి టీ20లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో టీమిండియా 21 పరుగుల తేడాతో విజయం సాధించింది.

133 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్

తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 18 ఓవర్లలో 133 పరుగులకు ఆలౌటైంది. ఛేదనకు దిగిన భారత్ 5.1 ఓవర్లలో వికెట్ కోల్పోయి 50 పరుగులు చేసింది. ఈ క్రమంలోనే వరుణుడు ఆటకు ఆటంకం కలిగించాడు. ఎంతకీ వర్షం తగ్గకపోవడంతో ఫలితాన్ని డీఎల్ఎస్ పద్ధతిలో అంపైర్లు ప్రకటించారు. వర్షం వచ్చే సమయానికి భారత్ అదనంగా 21 పరుగులు చేసి ఉండటంతో విజేతగా నిలిచింది.

సత్తా చాటిన భారత బౌలర్ అరుంధతీ రెడ్డి

ఆస్ట్రేలియా బ్యాటర్లలో జార్జియా(30) టాప్ స్కోరర్. లిచ్‌ఫీల్డ్(26), ఎలీస్ పెర్రీ(20) పర్వాలేదనిపించారు. ఇతర బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో అరుంధతీ రెడ్డి 4 వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాసించింది. శ్రీచరణి, రేణుకా సింగ్ తలో 2, క్రాంతి గౌడ్, దీప్తి శర్మ చెరొక వికెట్ తీసుకున్నారు. ఛేదనలో వర్షం పడే సమయానికి షఫాలీ వర్మ(21) ఔట్ అవ్వగా.. స్మృతి మంధాన (16*), జెమీమా రోడ్రిగ్స్(9*) క్రీజులో ఉన్నారు.

Read Also: అది ఆట.. పరుగుల బాట.. వికెట్ల వేట.. 61 పరుగుల తేడాతో పాక్ చిత్తు!

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

Most Popular

Recent Comments