
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుపొందినటువంటి మేడారం మహా జాతర నేటి నుంచి ఘనంగా ప్రారంభం అయ్యింది. దాదాపు నెలరోజుల పాటు నుంచి భక్తులు ఈ మేడారం మహా జాతరలోని సమ్మక్క-సారక్క అమ్మవార్లను దర్శించుకుంటూ పోతున్నారు. ఇక ఈరోజు నుంచి ఈ మేడారం మహా జాతర ప్రారంభం అవ్వగా లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దేశ నలుమూలల నుంచి కూడా ఈ గిరిజన జాతరకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. అయితే ఈ మేడారం మహా జాతరలో భక్తులు అమ్మవార్లకు ఇచ్చే ప్రధాన కానుక ఏమైనా ఉంది అంటే అది బెల్లం. ఇక్కడ బెల్లాన్ని బంగారంతో సమానంగా చూస్తారు. ఎందుకంటే గిరిజన సాంప్రదాయంలో బెల్లాన్ని ప్రకృతి ప్రసాదం గా భావిస్తూ ఉంటారు. అందుకే బెల్లాన్ని ఇక్కడ సమ్మక్క-సారక్క అమ్మవారులకు ప్రసాదంగా ఇస్తూ ఇది నిలువెత్తు బంగారం అని అంటూ ఉంటారు. ఎంతోమంది భక్తులు తమ కోరికలు తీరిన తర్వాత తమ బరువుకు సమానంగా తులాభారం వేసి బెల్లాన్ని సమర్పిస్తూ ఉంటారు. ఈ సమ్మక్క-సారక్క గద్దెల వద్ద బెల్లం ముక్కలను నైవేద్యంగా పెట్టి తిరిగి వాటిని ప్రసాదంగా భక్తులు తీసుకుంటూ ఉంటారు. ఈరోజు నుంచి ప్రారంభమైనటువంటి ఈ గిరిజన మహా జాతర ఈనెల 31వ తేదీ వరకు కూడా కొనసాగునుంది. ఇప్పటికే లక్షల సంఖ్యలో భక్తులు సమ్మక్క-సారక్క అమ్మవారులను దర్శించుకుంటున్నారు. రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ జాతరను ఎవరు మిస్ చేసుకోవద్దు.
Read also : బ్రేకింగ్ న్యూస్.. విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం కన్నుమూత
Read also : Telangana: స్కూళ్లకు నాలుగు రోజులు సెలవులు?





