Wednesday, February 18, 2026
Homeక్రీడలుఅల్లు అర్జున్ అంటే నాకు పిచ్చి : హార్దిక్ పాండ్యా

అల్లు అర్జున్ అంటే నాకు పిచ్చి : హార్దిక్ పాండ్యా

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు పుష్ప సినిమా తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారీగా గుర్తింపు వచ్చింది. ఆ సినిమా వసూళ్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సామాన్య ప్రజలతో పాటు అన్ని రంగాల ప్రముఖ వ్యక్తుల మనసులను దోచేసింది. పుష్ప సినిమా ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పటినుంచి కూడా ఎంతోమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయిపోయారు. ఇక తాజాగా టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా సైతం నాకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం అంటూ చెప్పుకోచ్చారు. నేను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు వీరాభిమాని అని అన్నారు. అల్లు అర్జున్ సినిమాలలో పుష్ప సినిమా అంటే నాకు చాలా ఇష్టం అంటూనే అందులోని ప్రతి సాంగ్స్ నాకు చాలా నచ్చాయి అని వెల్లడించారు.

పుష్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత తన బామ్మతో కలిసి “శ్రీవల్లి” పాటకు స్టెప్స్ కూడా వేసిన జ్ఞాపకాలను తాజాగా హార్థిక్ పాండ్యా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. పుష్ప సినిమాలోని అల్లు అర్జున్ యాటిట్యూడ్ అలాగే తన మేనరిజంతో నేను అతనికి వెంటనే ఫ్యాన్ అయిపోయాను అని తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో భాగంగా తెలిపారు. ఇక అల్లు అర్జున్ తమిళ స్టార్ డైరెక్టర్లతో భారీ బడ్జెట్ సినిమాలు చేయబోతున్నారు. ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో అల్లు అర్జున్ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాపై ఇప్పటికే అల్లు అర్జున్ అభిమానులతో పాటు యావత్ ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులు భారీగా హోప్స్ పెట్టుకున్నారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments