తెలంగాణ

మర్రిగూడ మండలంలో జోరందుకున్న అక్రమ నిర్మాణాలు..

పూర్తి క్రైమ్ మిర్రర్ కధనంతో మరో సంచిక ద్వారా మీ ముందుకు..

  • మండలంలో జోరందుకున్న అక్రమ నిర్మాణాలు..

  • వెంచర్ ల పేరిట భారీ కట్టడాలు..

  • గ్రామ పంచాయతీ అనుమతులు లేకుండానే నిర్మాణాలా..!!

  • అనుమతులు ఉన్నాయని యజమాని… ఇవ్వలేదంటూ పంచాయతీ సెక్రటరీ..

  • నోటీసులు ఇచ్చామంటూ చెప్పుకొస్తున్న కార్యదర్శి

  • స్థానిక నాయకుల అండదండలతో అక్రమ నిర్మాణ దశ పూర్తి..

  • తిరుగండ్లపల్లి రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 76లో నిర్మాణం..

  • అనుమతులు రానున్నాయని యజమాని..రోజులు దాటవేస్తూ ఇప్పటికే నిర్మాణం పూర్తి..

మర్రిగూడ(క్రైమ్ మిర్రర్) :- మండలంలో అక్రమ నిర్మాణాల జోరు రోజు రోజుకు పెరుగుతుంది.. ఆర్థిక బలం ఉంటే చాలు నన్నేమి చెయ్యలేరంటూ, కొంతమంది బడాలు గ్రామీణ ప్రాంతాలలో భూములను, కొనుగోలు చేస్తూ అనుమతులు లేకుండానే అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రభుత్వాన్ని మోసం చెయ్యడమే కాకుండా, పర్యావరణాన్ని కాలుష్యం చేస్తున్నారు.

 

తమవెంట స్థానిక నాయకుడి అండ ఉందంటూ, వారి ఇష్టానికి హద్దులే లేకుండా పోయాయి. తక్కువ ధరలకు రైతుల నుండి భూములు కొనడం, చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం చేస్తూ, ఫ్లాట్లు, ఇతర భారీ పరిశ్రమలని పెడుతూ, కోట్లకు పడగలు ఎత్తుతున్నారు. ఏదేమైనా ప్రభుత్వం నుండి అనుమతులు లేకుండానే, కట్టడాలు పూర్తి చెయ్యడంపై సర్వత్రా విమర్శలు వినపడుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, వారి నిఘా కరువవ్వడం కారణంగానే అక్రమ నిర్మాణాలు రాజ్యమేలుతున్నాయంటున్నారు.

 

మర్రిగూడ మండలం తిరుగండ్లపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని, 76 సర్వే నెంబర్లో నిర్మాణం పనులు జరుగుతున్నాయి. చుట్టూ ప్రహరీ కోసం అన్నట్లు, పైభాగంలో గెస్ట్ హౌస్ నిర్మాణం పూర్తి స్థాయికి చేరుకుంది. ఇట్టి విషయంపై పంచాయతీ సెక్రటరీని వివరణ కోరగా, గ్రామ పంచాయతీ నుండి ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని, నిర్మాణం ఆపాలని నోటీసులు కూడా ఇచ్చామని తెలిపారు.

 

కానీ సదరు యజమాని అనుమతులకు అప్లై చేసామని, త్వరలో వస్తాయని చెప్పుకొస్తున్నారు. అనుమతులు లేకుండా నిర్మాణం ఎలా చేస్తున్నారు.. అసలు ఆ నిర్మాణం ఎందుకోసమో అర్ధం కాని పరిస్థితి.. స్థానిక నాయకుడి అండదండలతో ఈ అక్రమ నిర్మాణం జరుగుతుందని, అధికారులు తమరిని ఏమీ చెయ్యలేరనే ధీమాతో, గదుల నిర్మాణం పూర్తి అయ్యిందంటున్నారు స్థానిక నాయకులు..!? మండల అధికారులు ఈ అక్రమ నిర్మాణంపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

పూర్తి క్రైమ్ మిర్రర్ కధనంతో మరో సంచిక ద్వారా మీ ముందుకు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button