
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- భారత్ మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నట్లుగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే తాజాగా కాశ్మీర్ లోని పల్గంలో జరిగిన ఉగ్రవాది దాడులలో అమాయకమైన 30 మంది భారతీయులు మరణించారు. ఈ 30 మంది అమాయకుల ప్రాణాలు బలి తీసుకున్నా ఉగ్రవాదులు పాకిస్తానీలుగా గుర్తించారు. ఒకవేళ భారత్ మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే ఖచ్చితంగా అంతర్జాతీయంగా భారతదేశానికి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే పాకిస్తాన్ చేసిన ఈ దుర్మార్గపు పనికి చాలా దేశాలు భారత్ తరుపున సపోర్ట్ గా నిలబడ్డాయి. అమెరికాతో పాటు యూరప్ సమాజం కూడా భారత్పై జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించాయి. కాబట్టి భారత్కు చాలా దేశాల నుంచి సపోర్టు దక్కేటువంటి అవకాశం ఉంది.
ఇక మరోవైపు పాకిస్తాన్ కు కూడా కొన్ని దేశాలు మద్దతును ఇవ్వనున్నాయి. పాకిస్తాన్ కు మద్దతు ఇచ్చే దేశాలు భారతదేశానికి చాలా సందర్భాల్లో విభేదాలు నెలకొన్నాయి. మరి ఒకవేళ యుద్ధమే జరిగితే పాకిస్తాన్ కు సపోర్ట్ గా నిలబడే దేశాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
చైనా:- భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే ఖచ్చితంగా చైనా పాకిస్తాన్ వైపు నిలబడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే పాకిస్తాన్ మరియు చైనా దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు బాగా ఉన్నాయి.
బంగ్లాదేశ్:- బంగ్లాదేశ్ దేశం కూడా పాకిస్తాన్కు మద్దతు నిలిచే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే తాజాగా బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభంలో భాగంగా అక్కడ మారిన ప్రభుత్వం భారతదేశానికి అనుకూలంగా లేదని స్పష్టంగా అర్థమవుతుంది. కనుక ఈ బంగ్లాదేశ్ దేశం కూడా మనకు వ్యతిరేకంగా నిలిచే అవకాశం ఉంటుంది అని నిపుణులు తెలుపుతున్నారు.
తుర్కియే:- అంతర్జాతీయంగా తృతీయ దేశం వాళ్లు కూడా చాలా సందర్భాల్లో భారతదేశానికి వ్యతిరేకంగా నిలిచారు. ఇక కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ కు సైతం ఈ దేశం మద్దతు తెలిపింది..
అజర్ బైజాన్ :- అజర్ బైజాన్ అనే దేశం ఎక్కువగా పాకిస్తాన్ కు మద్దతుగా నిలబడుతుంది. ఈ దేశం కాశ్మీర్ పైన ఐక్యరాజ్యసమితిలో పలిమర్లు పాకిస్తాన్కు మద్దతుగా నిలవడంతో ఈ యుద్ధంలో కూడా పాకిస్తాన్కు మద్దతుగా నిలిచే అవకాశం. భారత్ మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే ఈ కచ్చితంగా పాకిస్తాన్కు అజర్ బైజాన్ మద్దతుగా నిలిచే అవకాశం ఉంది.
కాబట్టి ఈ దేశాలన్నీ కూడా భారతదేశానికి వ్యతిరేకంగా నిలబడి పాకిస్తాన్ కు బాగా మద్దతు తెలిపేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ ఇరుదేశాల మధ్య యుద్ధం జరిగితే ఖచ్చితంగా భారతదేశం గెలుపు పొందుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే భారతదేశానికి అంతర్జాతీయంగా చాలా దేశాలు సపోర్ట్ గా నిలిచాయి. నిలుస్తాయి కూడా… ఎందుకంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా మూడుసార్లు వరుసగా బిజెపి ఘనవిజయం సాధించి నరేంద్ర మోడీ ప్రధానిగా మూడవసారి ఎన్నికయ్యారు. కాబట్టి ఈ ప్రధాని నరేంద్ర మోడీ అన్ని దేశాల నాయకులతో కూడా చాలా చాకచక్యంగా నడుచుకుంటారు. కాబట్టి రాజకీయంలోనూ, బలగంలోనూ అలాగే ఆర్మీలోనూ భారతదేశానిదే పై చేయి…