
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఏ హీరో సినిమా ఫ్లాప్ అయినా హీరోలకు మాత్రం అవకాశాలు వస్తూనే ఉంటాయి. కానీ హీరోయిన్లకు మాత్రం అలా ఉండదని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఒక హీరోయిన్ సినిమా ఇండస్ట్రీలో వరుస హిట్లు కొడుతుంది అంటే కచ్చితంగా ఆ హీరోయిన్ కు వరుసగా సినిమా ఆఫర్లు వస్తూనే ఉంటాయి. అదే వరుసగా రెండు సినిమాలు ఫ్లాప్ అయితే ఆ హీరోయిన్ ను పక్కన పెట్టేస్తారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో రష్మిక మందన, శ్రీ లీలా, పూజా హెగ్డే వీళ్ళందరూ దూసుకుపోతున్నారు. అయితే ఒకప్పుడు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సినిమా ఇండస్ట్రీలో వరుసగా ఓ వెలుగు వెలిగింది. అల్లు అర్జున్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సరసన నటించిన ఈ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు ప్రస్తుతం సినిమాలలో అవకాశాలే దొరకట్లేదు. వరుస ఫ్లాప్ లతో డీలా పడిపోయిన ఈ హీరోయిన్ ప్రస్తుతం కోలీవుడ్ మరియు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ ఉంది. అక్కడ కూడా సరైన హిట్ రాకపోవడంతో అవకాశాలు తగ్గిపోయాయి.
Read also : వరుసగా నాలుగో రోజు మూతపడిన కాలేజీలు.. 5000 కోట్లు చెల్లిస్తేనే ఓపెన్ చేస్తాం : FATHI
కానీ తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ నటిస్తున్నటువంటి “దేదే ప్యార్ దే 2” సినిమాలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. అయితే ఈ సినిమాలోని ఓ పాటను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పాటలో రకుల్ ప్రీత్ సింగ్ ఓ రేంజ్ లో రెచ్చిపోయింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ సినిమాలో గ్లామర్ డోస్ ఇంకా పెంచింది. ముఖ్యంగా ఒక స్టెప్పులో అయితే ఏకంగా అజయ్ దేవగన్ రకుల్ ప్రీత్ సింగ్ ఛాతి పై వాలి డాన్స్ చేయడం నెటిజన్లను ఆగ్రహానికి గురిచేసింది. రకుల్ ప్రీత్ సింగ్ ఎక్స్పోజింగ్ వేరే లెవెల్ లో చేసింది. సినిమాల ఆఫర్ల కోసం ఇంత దారుణంగా దిగజారాలా అని రకుల్ ప్రీత్ సింగ్ ను… మరోవైపు వివాహిత నటితో ఇలాంటి అసభ్యకరమైన డ్యాన్సులు అవసరమా అంటూ అజయ్ దేవగన్ ను సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు.
Read also : అనుమానం కలిగితే బురఖా తీయాల్సిందే.. ఇది పాకిస్తాన్ కాదు : కేంద్రమంత్రి





