
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులందరూ కూడా సంబరాలు చేసుకుంటుండగా మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు బాధలో ఉన్నారు. అయితే ఈ సందర్భంలోనే ప్రతి ఒక్కరి మనసులో ఒక ప్రశ్న రేకెత్తుతుంది. ఒకవేళ ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలలో కెసిఆర్ కనుక ప్రచారం చేసి ఉంటే నేడు ఫలితాలు వేరుగా ఉండేవి అని చాలామంది కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో కేసీఆర్ హుజూర్నగర్, నాగార్జునసాగర్ అలాగే మునుగోడు ఉప ఎన్నికల్లో కేసీఆర్ ప్రచారం చేయగా అప్పట్లో టిఆర్ఎస్ పార్టీ ఘనవిజయాలను సాధించింది. అయితే మరోవైపు హుజరాబాద్, దుబ్బాక కంటోన్మెంట్ ఉప ఎన్నికలలో కేసీఆర్ ప్రచారం చేయలేదు కాబట్టి అక్కడ ఆ పార్టీ ఘోరపరాజయాన్ని పొందింది. దీంతో కెసిఆర్ ఎక్కడైతే ఉప ఎన్నికలు జరిగినా దగ్గర ప్రచారం చేశారో అక్కడ ఆ పార్టీ తిరుగులేని విజయాన్ని పొందింది. సరిగ్గా ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలలో కూడా కెసిఆర్ ప్రచారం చేసి ఉంటే బీఆర్ఎస్ పార్టీ గెలిచేది యని.. కెసిఆర్ ప్రచారం చేయకపోవడం వల్లే నేడు బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అని చాలామంది కూడా విశ్లేషిస్తున్నారు. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు పూర్తి బాధ్యతలు కేసీఆర్ తన తనయుడు కేటీఆర్ కు అప్పగించారు. కేటీఆర్ సాధారణ ఎన్నికల కన్న ఈ ఉప ఎన్నికలకు చాలా శ్రమించి పార్టీని విజయం అంచులదాక తీసుకువచ్చారు. అయినా కూడా ఫలితం దక్కలేదు. ఈ సందర్భంలోనే ఒకవేళ కెసిఆర్ ప్రచారం చేసి ఉంటే కచ్చితంగా గెలిచే వాళ్ళమని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
Read also : జూబ్లీహిల్స్ ఓటమిపై కిషన్ రెడ్డి స్పందన
Read also : ప్రభుత్వ భూమి స్వాధీనానికి చర్యలు మొదలుపెట్టిన అధికారులు.. క్రైమ్ మిర్రర్ వార్తకు స్పందన!





