
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆట తీరు ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపోయేలా చేస్తుంది. ఇక తాజాగా భారత్ మరియు సౌత్ ఆఫ్రికా మధ్య నిన్న జరిగినటువంటి వన్డే మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీ చేసి ఓవరాల్ గా తన క్రికెట్ చరిత్రలో 83 సెంచరీలను నమోదు చేశారు. 100 సెంచరీలు చేసినటువంటి సచిన్ రికార్డులను విరాట్ కోహ్లీ సమం చేయడానికి ఎక్కువ సమయం అయితే పట్టేలా కనిపించడం లేదు. ఎందుకంటే నిన్న సౌత్ ఆఫ్రికా పై విరాట్ కోహ్లీ చెలరేగిన తీరు చూస్తుంటే కచ్చితంగా 100 సెంచరీలు చేసేలాగానే కనిపిస్తున్నాడు. ఇలానే రాబోయేటువంటి మ్యాచ్లలో ఆడితే మాత్రం కచ్చితంగా సచిన్ రికార్డులను సమం చేయడం విరాట్ కోహ్లీకి పెద్ద కష్టమేమి కాదు. ఇక 2027 వరల్డ్ కప్ ముందు భారత్ ఇంకా 20 వన్డే మ్యాచ్లు ఆడనుంది. ఇక ఇందులో భాగంగానే లీగ్ లో ఫైనల్ కు చేరితే మరో ఐదు నుంచి పది మ్యాచ్లు ఎక్కువగా ఆడేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం 83 శతకాలు బాదినటువంటి విరాట్ కోహ్లీ ఇకనుంచి ప్రతి మూడు మ్యాచ్లలో రెండు సెంచరీలు చేస్తే కనుక కచ్చితంగా సచిన్ రికార్డులను సమం చేయడం లేదా బద్దలు కొట్టేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. మరి ఈ తరుణంలో విరాట్ కోహ్లీ అభిమానులు కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు. విరాట్ కోహ్లీ 100 సెంచరీలు నమోదు చేస్తే చూడాలని ఉంది అని ఫాన్స్ తమ ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇదే ఊపులో విరాట్ కోహ్లీ వంగ సెంచరీలు చేస్తారా లేదా అనేది మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి.
Read also : ఒక హిడ్మా ను చంపితే 1000 మంది, ఒక ఐ బొమ్మ రవిని చంపితే 100 మంది పుట్టుకొస్తారు : CPI నారాయణ
Read also : నీ కాళ్లు మొక్కుతా తల్లి.. సర్పంచిగా నిలబడు.. మహబూబాబాద్ జిల్లాలో ఆసక్తికర ఘటన!





