
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిరోజు కూడా ఒక కొత్త మలుపు తిరుగుతూ ఉంటాయి. ఇక తాజాగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పార్లమెంటరీ కమిటీల శిక్షణ తరగతుల్లో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. పేదరికం లేని సమాజం కోసం తమ ప్రభుత్వం అహర్నిషలు కష్టపడుతూ ముందుకు వెళుతుంటుంది అని మంత్రి నారా లోకేష్ అన్నారు. అలాగే మాట తప్పడం,మడమ తిప్పడం వంటివి తెలుగుదేశం పార్టీ రక్తంలోనే లేవు అని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ నే ప్రతి ఒక్కరికి అధినాయకత్వం అంటూ.. ఈ పార్టీకి చంద్రబాబు సేనాధిపతి అయితే అందులో ఉన్నటువంటి మనమందరం కూడా ఆయన సైనికులము అంటూ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటినుంచి కూడా ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధిని ఒక జోడెద్దుల్లా చంద్రబాబు ముందుకు నడిపిస్తున్నారు అని లోకేష్ పేర్కొన్నారు. కొన్ని వారాల తర్వాత నారా లోకేష్ ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త చర్చనీయాంశంగా మారాయి.
Read also : Crime Mirror Big Breaking: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్..!
Read also : దివ్యాంగుల సమగ్ర అభివృద్ధి ప్రభుత్వం లక్ష్యం – నకిరేకల్ ఎమ్మెల్యే





