Homeతెలంగాణవిజ్ఞాన్ స్కూల్స్‌లో ఐఏఎస్, ఐపీఎస్ ఫౌండేషన్‌కు శ్రీకారం

విజ్ఞాన్ స్కూల్స్‌లో ఐఏఎస్, ఐపీఎస్ ఫౌండేషన్‌కు శ్రీకారం

•విద్యార్థులకు ఉన్నత లక్ష్యాల దిశగా మార్గదర్శనం

క్రైమ్ మిర్రర్,ఆత్మకూరు:- యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి పట్టణంలోని విజ్ఞాన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ పగిడాల జలందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఐఏఎస్, ఐపీఎస్ ఫౌండేషన్ ప్రోగ్రాంను శనివారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ సంయుక్తంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఇలాంటి ఫౌండేషన్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించడం అభినందనీయమని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షించారు. కార్యక్రమాన్ని నిర్వహించిన విజ్ఞాన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ డా. పగిడాల జలంధర్ రెడ్డిని అభినందించారు.

ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థల చైర్మన్ మహమ్మద్ అవేజ్ చిస్తి, జిల్లా విద్యాధికారి సత్యనారాయణ, మండల విద్యాధికారి నాగవర్ధన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల వెంకటేష్, స్వర్ణగిరి ఆలయ చైర్మన్ రామారావు,లింగ నరసింహారావు, ప్రోగ్రాం కోఆర్డినేటర్ రామ్ రెడ్డి, కరస్పాండెంట్ పగిడాల పురేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్స్ అపర్ణ, స్వాతి, పక్కిరు కొండల్ రెడ్డి, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు