
– నిజాయితీగా పని చేస్తా పేద ప్రజలకు అండగా ఉంటా
– గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి సమస్యలన్నీ పరిష్కరిస్తా
– ఉంగరం గుర్తుకే ఓటు వేయండి నన్ను గెలిపించండి ; స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి గుజ్జుల లావణ్య శంకర్
క్రైమ్ మిర్రర్, మహాదేవపూర్ :- అంబట్ పల్లి గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థి గుజ్జుల లావణ్య తెలిపారు. ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి చాలా వెనుకబడి ఉందని, యువత చదువుకున్న విద్యార్థులు ఆలోచించాలని అన్నారు. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా సర్పంచ్ అభ్యర్థిగా పోటి చేస్తున్నానని, గ్రామాభివృద్ధి ద్యేయంగా పనిచేస్తానని అన్నారు. చదువుకున్న యువతకు శిక్షణ కార్యక్రమాలు, అంగన్వాడి సెంటర్, గ్రామంలోని బీసీ కాలనీని అభివృద్ధి చేయడం, గ్రామ కమిటీ ని ఎన్నుకొని ఆ కమిటీ ద్వారా అభివృద్ధి పనులు చేయడం. పార్టీలకతీతంగా అందర్నీ కలుపుకొని గ్రామ అభివృద్ధి కోసం పనిచేయడం, గ్రామాభివృద్ధి లక్ష్యంగా తగు నిర్ణయాలు తీసుకొని, గ్రామం కోసం కృషి చేయడం లాంటి పనులు చేస్తానని తెలిపారు. నన్ను సర్పంచ్ అభ్యర్థి గెలిపిస్తే గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని గుజ్జుల లావణ్య అన్నారు.
Read also : నాకు బైపాస్ సర్జరీ జరిగింది.. అందుకే బయటకు రాలేదు : కొడాలి నాని
Read also : ఆస్ట్రేలియాలో సోషల్ మీడియా నిషేధం.. బాలుడి ఆత్మహత్యే ప్రధాన కారణం?





