
• కొరటికల్ లో 33 / 11 కెవి సబ్ స్టేషన్ ప్రారంభించిన ఎంఎల్ఏ, ఎమ్మెల్సీ
• గ్రామాల్లో విద్యుత్ సమస్యలు ఉండొద్దు .. ఎంఎల్ఏ
• రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలి .. ఎమ్మెల్సీ
• ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లను సన్మానించిన మందుల బీరప్ప
మునుగోడు,క్రైమ్ మిర్రర్:- మునుగోడులో లో ఓల్టేజ్ సమస్య లేకుండా చేస్తామని ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు..మండలములోని కొరటికల్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన 33 / 11 కెవి సబ్ స్టేషన్ ను ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా విద్యుత్ శాఖ అధికారి ఎస్ ఈ వెంకటేశ్వర్లు విద్యుత్ శాఖ అధికారులతో కలిసి ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు..గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు.నాయకులు మందుల బీరప్ప ఎమ్మెల్యే ఎమ్మెల్సీ లను సన్మానించారు.. ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ…ప్రతి ఇంట వెలుగు నింపేల , రైతన్నలకు 24 గంటలు విద్యుత్ అందేలా చూస్తామని,విద్యుత్ సమస్య తలెత్తకుండా సబ్ స్టేషన్ ల ఏర్పాటుకు ప్రపోజల్ పంపమన్నారు.. ఎమ్మెల్సీ నెల్లికంటీ సత్యం మాట్లాడుతూ విద్యుత్ సబ్ స్టేషన్ లు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మునుగోడుపై దృష్టిపెట్టి నిరంతరం అభివృద్ధికి కృషిచేయడం అభినందనీయం అన్నారు.విద్యుత్ అధికారులు రైతులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు..విద్యుత్ శాఖ అధికారులు డి ఈ అన్నయ్య, ఏ డి ఈ అశోక్ కుమార్, ఏఈ సురేష్ కుమార్,సబ్ ఇంజనీర్లు గోపీకృష్ణ,సంతోష్ కుమార్,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజ్, మునుగోడు మాజీ సర్పంచ్ మిరియాల వెంకటేశ్వర్లు,మండల అధ్యక్షులు బీమనపల్లి సైదులు ,అనంత లింగస్వామి గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు సైదులు, అద్దంకి సుమన్,విద్యుత్ శాఖ సిబ్బంది,గ్రామస్థులు పాల్గొన్నారు.
మునుగోడుకు ఉప ఎన్నిక తెప్పిస్తా.. రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
ఉత్తరాఖండ్ లో బురదలో మునిగిపోయిన గ్రామం.. 4గురు మృతి, 50 మందికి పైగా గల్లంతు!
Good