
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- భారత స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్నటి రోజున ఓ కార్యక్రమంలో పాల్గొన్న స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ 2023 అహ్మదాబాద్ లో జరిగినటువంటి వన్డే వరల్డ్ కప్ ఫైనల్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అహ్మదాబాద్ లో ఆస్ట్రేలియాతో జరిగినటువంటి వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఓడిపోయిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ ఓటమి తర్వాత నేను క్రికెట్ ను మానేయాలనుకున్నాను అని హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2022 లో ఎప్పుడైతే నేను కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టానో అప్పటినుంచి మన భారతదేశానికి వరల్డ్ కప్ తీసుకురావడానికి నా సర్వశక్తుల కష్టపడ్డాను అని అన్నారు. కానీ 2023 వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి తర్వాత చాలా బాధపడ్డాను.. ఆ సమయంలోనే ఇక క్రికెట్ మానేయాలనుకున్నాను అని అన్నారు.
Read also : ఫ్రీగా సినిమాలు చూడొచ్చని ఆప్స్, వెబ్ సైట్స్ ఓపెన్ చేస్తున్నారా?.. తస్మాత్ జాగ్రత్త!
కానీ ఆ తర్వాత జరిగిన టి20 వరల్డ్ కప్ లో నా కెప్టెన్సీలో జట్టు విజయం సాధించడం పట్ల చాలా గర్వంగా ఫీల్ అయ్యాను అని… కానీ 2023 ఫైనల్ మ్యాచ్లో మాత్రం ఓడిపోవడంతో చాలా కృంగిపోయాను అని తన బాధను వ్యక్తం చేశారు. ఇక చాలా రోజుల తర్వాత టి20 వరల్డ్ కప్ గెలవడంతో కోలుకున్నాను అని అన్నారు. అయితే ఇప్పుడు ఈ పరిస్థితులలో ఈ విషయాన్ని చెప్పడం చాలా ఈజీ కానీ ఆ రోజు ఓడిపోయిన తర్వాత ఆ సమయంలో చాలా క్లిష్టమైనది అని రోహిత్ శర్మ అన్నారు. ఇక 2027లో జరగబోయే వన్డే వరల్డ్ కప్ కు రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఆడాలి అని ఇప్పటికే ఫ్యాన్స్ అందరూ కూడా తమ విజ్ఞప్తిని కామెంట్ల రూపంలో బీసీసీఐ వరకు చేరేలా చేస్తున్నారు. అయితే మరోవైపు విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ ఇద్దరూ కూడా మరో వరల్డ్ కప్ ఆడడానికి ఆసక్తి చూపుతున్నారు. కాకపోతే అప్పటివరకు వారు ఈ మధ్యకాలంలో జరిగేటువంటి మ్యాచ్లలో అద్భుతంగా రాణిస్తూ అలాగే ఫిట్నెస్తూ ఉంటే కచ్చితంగా ఆడే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే ఎంతోమంది కోచులు మరియు క్రికెటర్లు చెప్పారు.
Read also : పూసలు అమ్ముకునే మోనాలిసా.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?





