Homeతెలంగాణప్రభుత్వం చేతిలోకి హైదరాబాద్‌ మెట్రో!

ప్రభుత్వం చేతిలోకి హైదరాబాద్‌ మెట్రో!

 

హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లనుంది. సోమవారం జరిగే కేబినెట్‌ మీటింగ్‌లో సర్కార్‌ తుది నిర్ణయం తీసుకునే ఛాన్సుంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మెట్రోను టేకోవర్‌ చేసుకునేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే దీని కోసం టెక్నికల్‌ కన్సల్టెంట్‌గా ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్‌, ఫైనాన్స్‌, లీగల్‌ అడ్వయిజర్‌గా ఐడీబీఐని రేవంత్‌ సర్కార్‌ నియమించింది. ఎల్‌ అండ్‌ టీకి ఇవ్వాల్సిన బకాయిలు, ఇతర అంశాలకు సంబంధించిన నివేదికను తయారుచేసి ప్రభుత్వానికి అందజేసింది. ఈ రిపోర్ట్‌పై చర్చించి… ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసుకోనున్నారు. వచ్చేనెల చివరి నాటికి ఈ ప్రక్రియ పూర్తయ్యేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

Most Popular

Recent Comments