
Lal Darwaza Bonalu: హైదరాబాద్ బోనాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. గోల్కొండ కోట మీద ఉన్న జగదాంబిక ఎల్లమ్మకు తొలి బోనం సమర్పించడంతో మొదలైన ఆషాఢం బోనాలు.. ఇవాళ లాల్ దర్వాజా మహంకాళి బోనాలతో ముగియనున్నాయి. ఇక లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహాంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 4 గంటల నుంచి అమ్మవారికి మహాభిషేకం, ధూప దీప నైవేద్యాలతో పూజలు జరుగుతున్నాయి.
పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రులు
రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. లక్షల మంది భక్తులు బోనం సమర్పించేందుకు తరలివస్తున్నారు. పోలీసులు భారీ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్నారు. ఆలయం దగ్గర విద్యుత్ అలంకరణలు, తాగునీటి సౌకర్యాలు, ఆరోగ్య శిబిరాలు సిద్ధం చేశారు. సోమవారం సాయంత్రం లాల్ దర్వాజా నుంచి చార్మినార్, ఢిల్లీ దర్వాజ వరకు ఘటాల ఊరేగింపు, పోతరాజు విన్యాసాలు జరగనున్నాయి. ఇవి కనులపండుగగా సాగుతాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రేపు అధికారిక సెలవు ఇచ్చింది. సోమవారం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, బ్యాంకులు మూతపడతాయి. ఆషాఢ మాసంలో హైదరాబాద్ లో బోనాల పండుగ జరగగా, శ్రావణమాసంలో తెలంగాణ వ్యాప్తంగా బోనాల ఉత్సవాలు జరుగుతాయి.
Read Also: యాదగిరిగుట్టలో స్పెషల్ గరుడ టికెట్లు, టీవీ ఛానెల్ కూడా..