
మోతే,క్రైమ్ మిర్రర్:- మోతే మండల పరిధిలోని సిరికొండ గ్రామంలో అర్ధరాత్రి జరిగిన దారుణ ఘటన సిరికొండ గ్రామంలో కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త కారింగుల వెంకన్న గౌడ్ తన భార్య కారింగుల పద్మ (40)ను రోకలి బండతో కొట్టి హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు.
హత్య చేసిన వెంటనే వెంకన్న స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి మధ్య సాగుతున్న దాంపత్య కలహాలే ఈ ఘటనకు కారణమని స్థానికులు చెబుతున్నారు. మోతె ఎస్సై అజయ్ కుమార్ కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Read also : Cultural Controversy: రామాయణ ప్రదర్శనలో అశ్లీల నృత్యం
Read also : ATM Fraud: దొరికిన ఏటీఎం కార్డుతో నగదు విత్ డ్రా.. ఆ తర్వాత ఏమైందంటే..?





