-
వనస్థలిపురం ఇన్స్పెక్టర్ మహేష్ గౌడ్
ఎల్బీనగర్, క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : ప్రజలంతా హోలీ పండుగను సహజ సిద్ధమైన రంగులతో ఇతరుల అంగీకారంతో భద్రత ప్రమాణాలను పాటిస్తూ ప్రశాంతంగా సంతోషంగా నిర్వహించుకోవాలని వనస్థలిపురం ఇన్స్పెక్టర్ తోట మహేష్ గౌడ్ తెలిపారు. హోలీ పండుగను పురస్కరించుకొని ప్రజలందరికీ పోలీస్ శాఖ తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రజలందరూ పండుగను ప్రశాంత వాతావరణంలో సాంప్రదాయాల నడుమ, ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా నిర్వహించుకోవాలని సూచించారు.
రసాయన రంగులను ఉపయోగించవద్దని పేర్కొన్నారు. యువత హోలీ పండుగ అనంతరం చెరువులో లోతట్టు ప్రాంతాల్లో స్నానాలు ఆచరించే క్రమంలో జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అని సూచించారు. అలాగే వాహనాలు నడిపే క్రమంలో అతివేగం, ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటివి మానుకోవాలని కోరారు. గుర్తుతెలియని వారిపై, ప్రయాణికులపై రంగులు చల్లి వారిని ఇబ్బంది పెట్టవద్దని సిఐ మహేష్ సూచించారు.
