
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ స్పందించారు. బంగ్లాదేశ్ లోని హిందువులను కాపాడాలి అంటూ తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు. ఈ పోస్టులో “హిందువులారా దయచేసి మేల్కోండి… మౌనం మిమ్మల్ని రక్షించదు” అని పేర్కొని ఉంది. కాగా కొద్ది రోజుల క్రితం బంగ్లాదేశ్ లో దీపు చంద్రదాస్ అనే హిందువును అతి దారుణంగా చంపి చెట్టుకు వేలాడదీసి మరి తగలబెట్టిన వీడియోలు అలాగే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. సరిగ్గా నేడు కాజల్ అగర్వాల్ కూడా ఈ ఫోటోను ఎడిట్ చేసి తన సోషల్ మీడియా స్టోరీ లో పెట్టారు.
Read also : గ్రామాలను తీర్చిదిద్దాలంటూ నూతన సర్పంచులకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి!
“ALL EYES ON BANGLADESH HINDHUS” అని క్యాప్షన్ కూడా పెట్టారు. ఇప్పుడిప్పుడే బంగ్లాదేశ్ లో హిందువులపై మరిన్ని దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న ఘటనలపై మన దేశంలో చాలామంది ప్రముఖులు స్పందిస్తూ ఉన్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా అలాంటి పరిస్థితులు మన భారతదేశంలో రాకుండా చూసుకోవాలి అని… కేంద్రం దీనిపై మరిన్ని చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళ్లాలి అని అన్నారు. ఎంతోమంది ఈ సినిమా ప్రముఖులు అలాగే రాజకీయ నాయకులు కూడా ఈ విషయంపై ఒక్కొక్కరు స్పందిస్తూ ముందుకు వెళ్తున్నారు. అలాగే మరోవైపు బంగ్లాదేశ్ ఇండియా పై కవ్వింపు చర్యలు చేస్తుంది అని.. పాకిస్తాన్ లాగా బంగ్లాదేశ్ దేశం తయారవుతుంది అని మరికొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఒక వారం ముందు ఐపీఎల్లో కూడా బంగ్లాదేశ్ ప్లేయర్లు అవసరమా అంటూ వార్తలు కూడా వచ్చాయి..
Read also : ఆఫ్గాన్ వీధుల్లో నేను బుల్లెట్ ప్రూఫ్ కార్ లోనే తిరుగుతా : రషీద్ ఖాన్





