
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా, పులివెందులలో హై టెన్షన్ మొదలైంది. పులివెందులలో ఈనెల 12వ తేదీన జడ్పిటిసి ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంలోనే వైసీపీ మరియు టీడీపీ నాయకులు ప్రచారాలు మొదలుపెట్టారు. కానీ పులివెందులలో జెడ్పిటిసి ఉప ఎన్నిక హై టెన్షన్ గా మారిపోయింది. జగన్ అడ్డా అయినటువంటి పులివెందులలో నేడు ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. పులివెందుల లోని నల్లగొండువారిపల్లిలో టీడీపీ మరియు వైసీపీ నేతల మధ్య వాగ్వాదాలు జరిగాయి. వైసీపీ నేతలు, టీడీపీ నేతలు ఒకేసారి ప్రచారం చేసుకుంటూ ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఇదే సమయంలో ఒకరిపై ఒకరు కవ్వింపు మాటలు మాట్లాడుకోవడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడి… ఇరు కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం ప్రారంభించారు. ఈ సమయంలోనే వైసీపీ ఎమ్మెల్సీ అయినటువంటి రమేష్ యాదవ్ అలాగే పలువురు కార్యకర్తలకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. దీంతో పులివెందుల మొత్తం కూడా హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఇప్పటికే పోలీసులు అక్కడికి చేరుకొని ఘర్షణలను అడ్డుకుంటున్నారు. మరికొద్ది క్షణాల్లో పూర్తి సమాచారం తెలుసుకుందాం. కాగా ఈనెల 12వ తారీఖున జడ్పిటిసి ఎన్నికలు జరగనుండగా.. టీడీపీ మరియు వైసీపీ సహా 11 మంది అభ్యర్థులు ఇక్కడ బరిలో ఉన్నారు.
Read also : BCలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకపోతే సహించం : సీఎం రేవంత్
Read also : సీఎం రేవంత్‌పై రాజగోపాల్‌రెడ్డి తీవ్ర విమర్శలు