క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: పోలీసులు కేవలం ట్రాఫిక్ ఉల్లంఘనలను నమోదు చేయాలి తప్ప, వ్యక్తుల పట్ల దురుసుగా ప్రవర్తించకూడదని పెండింగ్‌లో ఉన్న చలానాలను చెల్లించాలని వాహనదారులను రోడ్డుపై ఆపి బలవంతం చేయకూడదని హైకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది.
ట్రాఫిక్ నిబంధనల అమలు పేరుతో పోలీసులు వాహనదారులను వేధించకూడదని, వాహనదారుల నుండి బలవంతంగా వాహనాల కీలను తీసుకోవడానికి లేదా వారిని వాహనం దిగమని బలవంతం చేయడానికి పోలీసులకు అధికారం లేదని కోర్టు పేర్కొంది.
వాటిని వసూలు చేయడానికి చట్టబద్ధమైన ఇతర మార్గాలను అనుసరించాలని సూచించింది. పోలీసులు కేవలం ట్రాఫిక్ ఉల్లంఘనలను నమోదు చేయాలి తప్ప, వ్యక్తుల పట్ల దురుసుగా ప్రవర్తించకూడదని గతంలోనే పలు సందర్భాల్లో ఉన్నత న్యాయస్థానాలు స్పష్టం చేశాయి.





