
Heavy Rains Weather Alert: రాష్ట్రంలో వచ్చే 5 రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడంతో పాటు బంగాళాఖాతంలో ద్రోణి ఏర్పడటంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు రెండు రోజుల పాటు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఆదివారం నాడు పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినట్లు వాతావరణశాఖ తెలిపింది.
ఇవాళ ఏ జిల్లాల్లో వర్షాలు కురస్తాయంటే..
ఇవాళ (సోమవారం) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, కొత్తగూడెం, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.
మంగళవారం వర్షాలు కురిసే జిల్లాలు
మంగళవారం నాడు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అతిభారీ వానలు పడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, నల్లగొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వానలు పడే సూచనలున్నాయన్నారు. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయన్నారు. వర్షాలు పడే సమయంలో బయటకు రాకూడదని అధికారులు సూచించారు.
Read Also: యాదగిరిగుట్టలో స్పెషల్ గరుడ టికెట్లు, టీవీ ఛానెల్ కూడా..