
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు వర్షాలు భారీ ఎత్తున దంచి కొట్టునున్నాయి. రాబోయే మరో రెండు మూడు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది. మరీ ముఖ్యంగా మెదక్,రంగారెడ్డి, వికారాబాద్ మరియు యాదాద్రి జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఈ జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక మిగతా కొన్ని జిల్లాలు…
1. హైదరాబాద్
2. జగిత్యాల
3. గద్వాల్
4. కామారెడ్డి
5. మేడ్చల్
6. మహబూబ్నగర్
7. నిజామాబాద్
8. సిరిసిల్ల
9. వనపర్తి
రాబోయే మరో రెండు మూడు గంటల్లో ఈ తొమ్మిది జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంటూ ఎల్లో అలర్ట్ ప్రకటించారు. నేడు ఏపీతోపాటు పలు తీర ప్రాంతాలకు తుఫాన్ ఎఫెక్ట్ పొంచి ఉన్న కారణంగా అధికారులు అప్రమత్తమై ఇప్పటికే అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. ఈ తుఫాన్ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఈరోజు మరియు రేపు ప్రభావం చూపనుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు సూచించారు. కాబట్టి ప్రజలందరూ కూడా అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు అని సూచించారు. దూరపు ప్రయాణాలు కూడా వెంటనే రద్దు చేసుకోవాలని… పిల్లలు ఎవరిని కూడా విద్యుత్ స్తంభాలు అలాగే కాలవగట్లవైపు పంపించవద్దని సూచించారు.
Read also : రద్దీ ఉండే మార్గంలోనే ఆర్టీసీ బస్సులు నడపాలి : ఆర్టీసీ ఎండీ
Read also : బ్రేకింగ్ న్యూస్… హరీష్ రావు తండ్రి మృతి





