
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో నేడు కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. కొన్ని జిల్లాలలో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏకంగా నాలుగు రోజులపాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
నేడు ఏపీలో వర్షాలు పడే జిల్లాలు
1. అన్నమయ్య
2. చిత్తూరు
3. ప్రకాశం
4. తిరుపతి
నేడు తెలంగాణలో వర్షాలు పడే జిల్లాలు
1. అదిలాబాద్
2. నిజామాబాద్
3. జగిత్యాల
తెలుగు రాష్ట్రాల్లో పైన పేర్కొన్న జిల్లాల్లో నేడు పిడుగులతో కూడినటువంటి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే గత రెండు నెలల నుంచి భారీ వర్షాలు కురవడం వల్ల ప్రజలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడడమే కాకుండా నష్టపోవడం కూడా జరిగింది. ఇక వాహనదారులు కూడా బయటకు వెళ్లాలంటేనే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి మరో రెండు వారాలపాటు ఈ వర్షాలు ఉండేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు ఎప్పుడో వెల్లడించారు. ఈనెల చివర ఆఖరిలోపు వర్షాలు తగ్గు ముఖం పడతాయని తెలిపిన విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే.
Read also : గడ్డం కృష్ణపై రేప్, పోక్సో కేసులు – ఎస్పీ శరత్ పవార్ దర్యాప్తు పర్యవేక్షణ
Read also : వడ్డీ బాధితుడి ఆత్మహత్యతో ఉద్రిక్తత – పలుగుతండాలో బాలాజీ గృహంపై దాడి