జాతీయంలైఫ్ స్టైల్

Heart Attack: లైట్ తీసుకోకండి.. ఈ లక్షణాలు మీలో కనిపిస్తే ప్రాణాలకే ముప్పు!

Heart Attack: ప్రస్తుత ఆధునిక కాలంలో చాలా మంది జీవనశైలిపై సరైన శ్రద్ధ చూపడం లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో ముందస్తు ప్రణాళిక లేకుండా రోజులు గడుపుతున్నారు.

Heart Attack: ప్రస్తుత ఆధునిక కాలంలో చాలా మంది జీవనశైలిపై సరైన శ్రద్ధ చూపడం లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో ముందస్తు ప్రణాళిక లేకుండా రోజులు గడుపుతున్నారు. సమయానికి భోజనం చేయకపోవడం, ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవడం, పొగతాగడం, మద్యం సేవించడం వంటి అలవాట్లు సాధారణంగా మారిపోయాయి. ఈ నిర్లక్ష్యమే అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారి తీస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్న అంశం గుండెపోటు. గతంతో పోలిస్తే గుండెపోటుతో అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. వృద్ధులే కాదు, యువత కూడా హార్ట్ అటాక్ బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

గుండెపోటు అనేది తీవ్రమైన మరియు ప్రాణాంతకమైన ఆరోగ్య సమస్య. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో ఆటంకం ఏర్పడినప్పుడు, గుండె కండరాలకు నష్టం వాటిల్లి గుండెపోటు సంభవిస్తుంది. ఇది అకస్మాత్తుగా రావచ్చు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా తీస్తుంది. అయితే, ముందుగానే లక్షణాలను గుర్తిస్తే ప్రాణాలను కాపాడుకునే అవకాశం ఉంటుంది.

గుండెపోటుకు ప్రధానంగా కనిపించే లక్షణాల్లో ఛాతీ నొప్పి ముఖ్యమైనది. ఛాతీ మధ్య భాగంలో ఒత్తిడి, బిగుతు, భారంగా లేదా మండుతున్నట్లు అనిపించవచ్చు. ఈ నొప్పి కొన్ని నిమిషాల పాటు కొనసాగుతుంది. కొన్నిసార్లు మెడ, ఎడమ దవడ, భుజం, వీపు లేదా చేతులకు వ్యాపిస్తుంది. అయితే, గ్యాస్ సమస్యతో వచ్చే నొప్పితో దీన్ని తేలికగా తీసుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు.

ఛాతీ నొప్పి లేకపోయినా శ్వాస ఆడకపోవడం కూడా గుండెపోటుకు కీలక సంకేతం కావచ్చు. గుండె సరిగా పని చేయకపోతే శరీరానికి తగినంత ఆక్సిజన్ అందదు. దీంతో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడం కష్టంగా మారితే వెంటనే అప్రమత్తం కావాలి.

ఎటువంటి కారణం లేకుండా చలితో చెమటలు పట్టడం కూడా గుండెపోటుకు హెచ్చరికగా భావించాలి. ఇది వేడి లేదా శ్రమ వల్ల కాకుండా శరీరంలో జరుగుతున్న అంతర్గత సమస్యకు సంకేతంగా ఉండొచ్చు. అలాగే తల తిరగడం, కళ్లు బైర్లు కమ్మడం, మూర్ఛపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే రక్తపోటు తగ్గినట్టుగా అర్థం చేసుకోవాలి.

కొంతమందిలో గుండెపోటు సమయంలో వికారం, వాంతులు, కడుపు నొప్పి, అజీర్ణం లేదా ఛాతీలో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే ఎటువంటి శ్రమ లేకపోయినా తీవ్రమైన అలసట అనిపిస్తే, అది గుండె సమస్యకు సంకేతంగా ఉండొచ్చు.

గుండెపోటు సమయంలో ఛాతీ నుంచి ప్రారంభమైన నొప్పి చేతులు, మెడ, దవడ లేదా వీపు వరకు వ్యాపిస్తుంది. ఎక్కువగా ఎడమ చేతిలో నొప్పి కనిపించినా, కొన్నిసార్లు కుడి చేతిలో కూడా రావచ్చు. అంతేకాదు, గుండె దడలు ఎక్కువగా అనిపించడం లేదా గుండె వేగంగా కొట్టుకుంటున్నట్లు అనిపిస్తే దానిని నిర్లక్ష్యం చేయరాదు.

NOTE: ఇది సోషల్ సమాచారం మాత్రమే. ఈ లక్షణాల్లో ఏదైనా కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం అత్యంత ముఖ్యం. సకాలంలో చికిత్స అందితే ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ‘క్రైమ్ మిర్రర్’ దీనిని అధికారికంగా దృవీకరించడం లేదు.

ALSO READ: Psycho: ప్రియుడితో కలిసి భర్తను చంపి.. రాత్రంతా పోర్న్ వీడియోలు చూస్తూ గడిపిన మహిళ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button