
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- నటుడు శివాజీ మరియు అనసూయ మధ్య జరిగినటువంటి ఏదైతే వస్త్రధారణ ఇష్యూ ఉందో ఆ ఇష్యూ అనేది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ ఇష్యూ అనేది రోజురోజుకు కూడా ముదిరిపోతుంది. దీనికి గల కారణమేంటంటే వివిధ ప్రముఖులు ఈ విషయంపై స్పందించడమే. తాజాగా మహిళల వస్త్రధారణ పై శివాజీ చేసిన వ్యాఖ్యలను జనసేన ఎమ్మెల్సీ, నటుడు నాగబాబు తప్పు పట్టారు. మహిళలు మోడ్రన్ డ్రెస్ ధరించడం తప్పు కాదు అంటూ.. మహిళలను కట్టడి చేయడం కంటే రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయాలి అని నాగబాబు అన్నారు. అయితే నాగబాబు చేసిన వ్యాఖ్యల వీడియోలను కొందరు మెగా అభిమానులు చూసిన తర్వాత తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో అనేక ఇబ్బందులు ఉండగా అనేకమైన విషయాల జోలికి వెళ్లడం ఎందుకు అని.. ఇలాంటి కామెంట్స్ చేయడం వల్ల ప్రత్యర్థులకు టార్గెట్ అవడం తప్ప ఎలాంటి లాభం లేదు అని అంటున్నారు. ఏది ఏమైనా కూడా ఈ వివాదం ఇప్పటికీ కూడా అలానే కొనసాగుతుంది. ఇక ఏదైతే ఈ ఇష్యూ ఉందో దీనికి నటుడు శివాజీ క్షమాపణలు కూడా తెలియజేశారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఈ వివాదం హైలైట్ అవుతూ ఉంది.
Read also : యూరియా కోసం రైతుల ఇబ్బందులు…పోలీసుల పర్యవేక్షణలో పంపిణీ
Read also : నేటి 29-12-25 తెలంగాణా రాష్ట్ర ప్రధాన వార్తలు..!





