క్రైమ్తెలంగాణ

నిఘా పటిష్టంతో కారులో రూ.4 కోట్ల హవాలా నగదు స్వాధీనం

హైదరాబాద్‌, క్రైమ్ మిర్రర్: నగరంలో హవాలా కార్యకలాపాలపై నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసిన బోయిన్‌పల్లి క్రైమ్ పోలీసులు కీలక సమాచారంతో విజయం సాధించారు. ప్రత్యేక సమాచారంతో సాగిన దాడుల్లో, కారులో రహస్యంగా తరలిస్తున్న రూ.4 కోట్ల హవాలా నగదును పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. వాహనం టైరు, సీట్ల కింద రహస్యంగా ఈ నగదును దాచినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ ముఠాపై చాలాకాలం నుంచే నిఘా ఉంచి, వారి కదలికలపై పూర్తి సమాచారం సేకరించిన తరువాతే పోలీసులు దాడి చేపట్టినట్లు తెలిసింది. నగదు తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. డబ్బు మూలం, పంపిన వలయం, గమ్యస్థానం, సంబంధిత కీలక లింక్‌లపై దర్యాప్తు వేగం పుంజుకుంది.

అక్రమ డబ్బు రవాణా పెరుగుతున్న వేళ, నగర నిఘా వ్యవస్థ ప్రభావవంతంగా పనిచేస్తోందనే సంకేతాలను ఈ ఘటన ఇస్తోంది. హవాలా నెట్వర్క్‌ను పూర్తిస్థాయిలో అణచివేయడానికి చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు…

Back to top button