
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో :- లండన్ పర్యటనలో ఉన్న మాజీ మంత్రి హరీష్‌రావు మీడియాతో మాట్లాడుతూ, బీఆర్‌ఎస్ పార్టీపై తలెత్తుతున్న చర్చలకు ముగింపు పలికేలా వ్యాఖ్యలు చేశారు. హరీష్‌రావు స్పష్టం చేస్తూ, మన పార్టీకి సుప్రీం లీడర్ కేసీఆర్ గారే. ఎవరిపై ఏ నిర్ణయం తీసుకోవాలో, ఎలాంటి చర్యలు ఉండాలో అన్నది పార్టీ ఆలోచన ప్రకారమే జరుగుతుంది. మేమంతా ఒకే దారిలో నడుస్తూ ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. అదే కేసీఆర్ మాకు నేర్పిన మార్గం అన్నారు. కెసిఆర్ ఎలా చెప్తే అలానే నడుచుకుంటామని అన్నారు.
Read also : వావ్ అద్భుతం.. 34 ఏళ్ల మహిళకి 5.2 కేజీల బాలుడు జననం
ఇటీవల పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ, అవి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమేనని హరీష్‌రావు పేర్కొన్నారు. పార్టీ విధానానికి దానికి సంబంధం లేదని, ఎవరైనా పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని సూచించారు. హరీష్‌రావు చేసిన ఈ వ్యాఖ్యలు బీఆర్‌ఎస్ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో ఆయన స్పష్టమైన వైఖరి పార్టీకి బలాన్నిస్తోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి కవిత పార్టీ నుంచి తప్పుకోగా.. ఈ ప్రభావం రాబోయే ఎలక్షన్లలో ఎలా ఉంటుందనేది తెలియాల్సి ఉంది. ప్రజలు ఎటువంటి తీర్పు ఇస్తారనేది కొద్దిరోజుల పాటు వేచి చూడాల్సిందే.
Read also : ఆకస్మిక గుండెపోటుకు కారణం ఇదే.. ప్రతి ఒక్కరు తెలుసుకోండి?