Homeతెలంగాణఘనంగా మంచి రాజేష్ జన్మదిన వేడుక.. శుభాకాంక్షలు తెలిపిన మాజీ కార్పొరేటర్

ఘనంగా మంచి రాజేష్ జన్మదిన వేడుక.. శుభాకాంక్షలు తెలిపిన మాజీ కార్పొరేటర్

ఎల్బీనగర్,క్రైమ్ మిర్రర్:- కొత్తపేట డివిజన్‌ బీజేపీ కార్యాలయంలో డివిజన్ అధ్యక్షులు మంచి రాజేష్ కుమార్ జన్మదినం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తపేట డివిజన్ మాజీ కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్ హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజేష్ కుమార్ పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్న కట్టుబడి ఉన్న నాయకుడని, యువ నాయకత్వానికి మంచి ఆదర్శమని ప్రశంసించారు. పార్టీ అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. ఈ వేడుకలో బీజేపీ జిల్లా నాయకులు వగ్గుల సుందర్ నారాయణ, కౌన్సిల్ మెంబర్ కాటా విజయ గౌడ్, స్వర్ణ, తిరుమల, శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రామ కృష్ణ, గట్టు మహేష్ కుమార్, సాయి పాటిల్, శరణ్, తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు