క్రీడలు

జన్మదిన శుభాకాంక్షలు హార్దిక్ భాయ్.. సోషల్ మీడియాలో విషెస్ వెల్లువ!

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- భారత స్టార్ క్రికెటర్, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా పుట్టినరోజు నేడు. మన భారతదేశ క్రికెట్ చరిత్రలో స్టార్ ఆల్రౌండర్ గా గుర్తింపు పొందిన హార్దిక్ పాండ్యా తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చవి చూశాడు. ఒకవైపు ఆటపరంగా, మరోవైపు జీవితం పరంగా ఎన్నో కష్టాలను ఎదుర్కొని పైకి వచ్చిన వ్యక్తి హార్దిక్ పాండ్యా. ఒక స్టార్ ఆల్ రౌండర్ గా ఇండియాకు టి20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ వంటి ట్రోఫీలలో హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. అలాంటి హార్దిక్ పాండ్యా గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అన్ని ఫార్మేట్ లలో కలిపి 4 వేలకు పైగా పరుగులు చేసిన ఆల్ రౌండర్ గా నిలిచాడు. అంతర్జాతీయ టి20లో ఆల్ రౌండర్ లో నెంబర్ 2 స్థానంలో ప్రస్తుతం హార్దిక్ పాండ్యా భాయ్ ఉన్నారు. దీన్ని బట్టి మనం హార్దిక్ పాండ్యా భారత జట్టు తరుపున ఎలాంటి పెర్ఫార్మెన్స్ అందిస్తున్నారు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకానొక దశలో ఇండియాకు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా లేకపోతే కచ్చితంగా మ్యాచ్లు ఓడిపోతారు అనే సందర్భాలు కూడా చూశాం. మరి ముఖ్యంగా గత ఏడాది జరిగిన టి20 వరల్డ్ కప్ లో భాగంగా హార్దిక్ పాండ్యా లేకుంటే కచ్చితంగా టీమిండియా ఓడిపోయేది. సౌత్ ఆఫ్రికా ప్లేయర్ క్లాసిన్ అద్భుతంగా రానిస్తున్న సమయంలో హార్థిక్ పాండ్యా వికెట్ తీశారు. అలాగే మిల్లర్ వికెట్ కూడా తీయడంతో భారత్ t20 వరల్డ్ కప్ లో ఘన విజయం సాధించింది. ఈ టి20 వరల్డ్ కప్ సాధించడానికి ముఖ్య కారణం హార్దిక్ పాండ్యా అనే ఇప్పటికీ ప్రతి ఒక్కరు చెప్తూనే ఉంటారు. అలాంటి హార్దిక్ పాండ్యా జన్మదినం నేడు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా హార్దిక్ పాండ్యాకు పెద్ద ఎత్తున విశేష్ తెలుపుతున్నారు. ప్రముఖుల తో పాటు ఆర్థిక పాండ్యా ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా వేదిక హ్యాపీ బర్త్డే హార్థిక్ బాయ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read also : 14 న రాష్ట్ర బంద్ కు రాజకీయ పార్టీలన్నీ మద్దతు ఇవ్వాలి : బీసీ నేత

Read also : తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button